Fire Break : కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ కవర్లు తయారీకి ఉపయోగించే ఓ పాలిమర్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. పొగలు కమ్మేయడంతో పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజిన్‌లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. ప్రాణనష్టం సంభవించిందా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Hyderabad Man In Russia: దళారుల చేతుల్లో మోసపోయి.. రష్యాలో చిక్కుకున్న హైదరాబాదీ..