Drugs : డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బును హవాలా రాకెట్‌గా మారుస్తున్న గ్యాంగ్‌ను పట్టుకుంది తెలంగాణ ఈగల్ టీమ్. ముంబై కేంద్రంగా హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్‌పిన్‌ను పట్టుకున్నారు. హవాలా రూపంలో నైజీరియన్ డ్రగ్ కార్టెల్స్‌కు డ్రగ్ మనీ పంపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ మరో పెద్ద మాఫియా గుట్టురట్టు చేసింది. ముంబై కేంద్రంగా నడుస్తున్న హవాలా నెట్వర్క్‌ను చేధించడమే కాకుండా… హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్‌పిన్‌ను పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. నార్కోటిక్స్ కేసులో రాచకొండ పోలీసులు పట్టుకున్న ఓ నైజీరియన్‌ను పట్టుకుని విచారించిన ఈగల్ టీమ్… తీగ లాగితే డొంక కదిలింది. విచారణలో సంచలన విషయాలు రాబట్టిన టీమ్… ఏకంగా నెట్‌వర్క్‌కు చెక్ పెట్టింది.
Read Also : Love Story : ప్రేమ వేధింపులకు యువతి బలి
డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ నైజీరియన్ ఎసోమ్చీ కెనెత్ అలియాస్ మ్యాక్స్‌వెల్ అలియాస్ ఇమ్మాన్యుయెల్ బెడియాకోను ఈగల్ టీమ్‌కు అప్పగించారు రాచకొండ పోలీసులు. నైజీరియన్ డ్రగ్ పెడ్లర్‌ను విచారించిన ఈగల్ టీమ్.. కీలక విషయాలు రాబట్టింది. ఇతడు ఇచ్చిన సమాచారంతో ముంబై వెళ్లిన తెలంగాణ ఈగల్ ఫోర్స్.. సంచలన విషయాలు కనిపెట్టింది. డ్రగ్స్ సరఫరా.. డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును హవాలా రూపంలో తరలిస్తున్నట్లు గుర్తించారు. దుర్గారం రతాజీ ప్రజాపతి అనే డ్రగ్ డీలర్… ముంబై కేంద్రంగా హవాలా నెట్‌వర్క్ నడుపుతున్నాడు. ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ సిటీల్లో హవాలా ఆఫీసులు ఏర్పాటు చేశాడు ప్రజాపతి. గోవా, ముంబై, ఢిల్లీలో ఉన్న ఏజెంట్లు… ఆయా సిటీల్లో ఉన్న నైజీరిఆయన్ డ్రగ్ పెడ్లర్ల ద్వారా డబ్బు సేకరించి హవాలా కేంద్రాలకు తరలిస్తారు. ఈ డబ్బు మొత్తాన్ని హవాలా రూపంలో నైజీరియాకు చేరవేస్తున్నాడు ప్రజాపతి. ఈ తతంగాన్ని అంతా గుర్తించిన తెలంగాణ ఈగల్ టీమ్.. హవాలా కేంద్రంపై రైడ్ చేసింది. ప్రజాపతిని రెడ్ హ్యాండెండ్‌గా అదుపులోకి తీసుకున్నారు. హవాలా కేంద్రంలో 3 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా ఏజెంట్లు… డ్రగ్ పెడ్లర్ల ద్వారా డబ్బులు సేకరించి ముంబైలోని ప్రజాపతికి పంపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ డబ్బును హవాలాగా మార్చి.. పలు మార్గాల్లో నైజీరియా చేరవేస్తున్నాడు ప్రజాపతి…