Physical Harassment : వికారాబాద్ జిల్లా దోమ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ళ బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారయత్నానికి ఒడిగట్టాడో యువకుడు. బాలిక కేకలు వేయడంతో ఇంటి బయట ఉన్న తండ్రి పరుగెత్తుకు రావడంతో యువకుడు పరారయ్యాడు. దీంతో.. 100 డయల్ ద్వారా పోలీసులకు బాధిత బాలిక తండ్రి సమాచారం అందించాడు. బాలిక…
Maoists : ములుగు జిల్లాలో నక్సలైట్ ఉద్యమానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం జిల్లాలో ఎనిమిది మంది మావోయిస్టు సభ్యులు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. వారు జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఎదుట తమ ఆయుధాలను వదిలి, సాధారణ జీవితం వైపు అడుగులు వేసే నిర్ణయం తీసుకున్నారు. లొంగుబాటు అయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా రూ.25,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయబడింది. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు…
హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. నిన్నటి వరకు కమిషనరేట్ కు ఒకే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉండేది. నేటి నుంచి జోన్ ల వారికి అమలు లోకి రానున్నాయి. సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో జోనల్ సైబర్ సెల్స్ అమలులోకి వచ్చాయి. ఇక పై ప్రతి జోన్ లో ఒక్కో సైబర్ సెల్ స్టేషన్ ఉంటుంది. కాగా.. గడిచిన 9 సంవత్సరాల్లో సైబర్ నేరాలు 786…
ఉప్పరపల్లి గౌతమ్ నగర్ లో ఎస్బీ ఇన్స్పెక్టర్ పై దాడి జరిగింది. చార్మినార్ అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబంలో పదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల వివరాలు నోట్ చేస్తుండగా ఆగ్రహంతో సీఐపై మృతుల బంధువుల దాడి చేశారు. మీడియాను మృతుల కుటుంబ సభ్యులు అనుమతించలేదు. గౌతమ్ నగర్ కు వెళ్లిన మీడియా, పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad Police : హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దుబాయ్లో జరుగుతున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025లో హైదరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో విశేష కృషి చేసినందుకు గాను, ఎక్సలెన్స్ ఇన్ యాంటీ-నార్కోటిక్స్ అవార్డులో హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ అవార్డును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) డీజీ సీవీ ఆనంద్ దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన…
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు అంతర్జాతీయ అవార్డు లభించింది.. సీవీ ఆనంద్కు ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డు ప్రదానం చేయనుంది.. డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించినందుకు సీవీ ఆనంద్కు అవార్డు దక్కింది.. దుబాయ్లో జరగబోయే అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో అవార్డు ప్రదానం చేస్తారు.. ఈ ముఖ్యమైన వేదిక అయిన వరల్డ్ పోలీస్ సమ్మిట్-2025 కు 138 దేశాల నుంచి ప్రముఖ పోలీసు అధికారులు ఒకేచోట సమావేశమవుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ భద్రత ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా డీజీప మాట్లాడుతూ.... రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసు అధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్…
HYDRA Police Station : హైదరాబాద్ నగరంలో భారీ స్పందన పొందిన హైడ్రా (HYDRAA) ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రత్యేక విభాగానికి ఇటీవల ప్రభుత్వం మరిన్ని అధికారాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించినట్లుగా, త్వరలో ప్రత్యేక హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా, మే 8వ తేదీన ముఖ్యమంత్రి…
Pakistani Nationals: కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత గడువులోపు దాయాది దేశ పౌరులు భారత్ విడిచి వెళ్లాలని తెలిపింది. పాకిస్తాన్ దేశస్థులు భారత్ ను వీడేందుకు ఈ రోజు (ఏప్రిల్ 29) చివరి రోజు..
మావోయిస్టు పార్టీ లో ఉన్న తెలంగాణ వాసులందరూ లొంగిపోవాలని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.. తెలంగాణ పోలీసులు కర్రెగుట్టలో ఎలాంటి ఆపరేషన్స్ నిర్వహించట్లేదని స్పష్టం చేశారు.. కేంద్ర బలగాల నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.. వెంకటాపురం ఏరియాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని కేంద్ర బలగలు మోహరించి ఆపరేషన్ నిర్వహిస్తున్నారన్నారు..