Betting Apps : ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ సూచన మేరకు సూర్యాపేట జిల్లా పోలీసులు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు చేశారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కారణంగా నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. అయితే, సన్నీ యాదవ్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో, పోలీసులు అతని ఇంటికి నోటీసులు అంటించారు. నోటీసులు ఇచ్చిన రెండు వారాలు గడుస్తున్నప్పటికీ, అతని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నూతనకల్ పోలీసులు భయ్యా సన్నీ యాదవ్‌పై లుక్‌ఔట్ నోటీసులను జారీ చేశారు.
తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో పేరొచ్చినవారిలో హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, పరేషాన్ బాయ్స్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరు ముగ్గురు దుబాయ్‌కు వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని వారే గతంలో పోస్టు చేసిన వీడియోలు ధృవీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో పోలీసులు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నేరుగా లేదా పరోక్షంగా యువతను బెట్టింగ్ వైపు ఆకర్షించే ఇన్‌ఫ్లూయెన్సర్లను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పోలీసుల విచారణకు హాజరయ్యారు. మరికొందరు తమ ప్రమోషన్ కంటే ముందుగా బెట్టింగ్ యాప్‌ల గురించి తెలియదని వివరణ ఇచ్చారు. కొంతమంది మరోసారి ఇలాంటి తప్పులు చేయబోమని వీడియోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో, పరారీలో ఉన్నవారిని త్వరగా భారతదేశానికి రప్పించి, విచారణ కొనసాగించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.
Mohanlal : టాలీవుడ్ దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీ.. మోహన్ లాల్ ప్రశంసలు