బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్‌పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేశ్, ఉమా దంపతులు, వారి ముగ్గురు పిల్లలతోపాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.. మిస్సింగ్ గురైన బాధిత కుటుంబ సభ్యులు ఎన్టీవీతో మాట్లాడారు. “న్యూ బోయిన్‌పల్లి నుండి మా అన్నయ్య ఫ్యామిలీ మిస్సింగ్ అయ్యారు. మంగళవారం సాయంత్రం నుండి అందుబాటులో లేరు. మేము సిటీ లో చాలా చోట వెతికాం కానీ ఎక్కడ ఆచూకీ దొరకలేదు. మాకు తెలిసిన వరకు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు ఏమీ లేవు. ఆరుగురు ఆటో బుక్ చేసుకొని బోయిన్‌పల్లి నుంచి ఎంజీబీఎస్ స్టేషన్‌కు వెళ్లినట్లు పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా కనుకొన్నారు. ఎంజీబీఎస్ లో విజయవాడకు చెందిన బస్సు ఎక్కినట్లు సీసీ ఫుటేజ్ లో పరిశీలించారు పోలీసులు. మా అన్నయ్య ఫ్యామిలీ మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆటో డ్రైవర్ కూడా పోలీస్ విచారించారు” అని తెలిపారు.
READ MORE: PM Modi: శ్రీలంకలో మోడీకి ఘనస్వాగతం.. 3 రోజులు పర్యటన
వాట్సాప్ లో మెసేజెస్ పెట్టిన కాల్స్ చేసిన రెస్పాండ్ అవ్వడం లేదని బాధిత కుటుంబీకులు వెల్లడించారు. “అక్కడి నుంచి ఎటు వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నరూ పోలీసులు. గత కొంత కాలంగా మా అన్నయ్య ఫ్యామిలీ బోయిన్పల్లి లో నివాసం ఉంటున్నారు. మహేశ్, ఉమా దంపతులు. వారికి ముగ్గురు సంతానం చిన్న పిల్లలు ఉన్నారు. వీరితో పాటు మా మరదలు సంధ్య కూడా కనబడలేదు. స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నడు మహేష్. మేము ఇచిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకున్నరూ బోయిన్ పల్లి పోలీసులు.” అని వివరాలు వెల్లడించారు.