DGP Jitender: తెలంగాణ పరిశ్రమల భద్రతకు డీజేపీ కొత్త దిశా నిర్దేశం
- పరిశ్రమల భద్రతపై ప్రత్యేక దృష్టి
- సైబర్ నేరాల నివారణకు ఐజీ స్థాయి నిఘా
- మహిళా ఉద్యోగుల రక్షణకు షీ టీమ్స్, షీ షటిల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Jithender : తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (FTCCI) ఆధ్వర్యంలో మెరుగైన పోలీస్ నిఘా , ప్రజా భద్రతపై రాష్ట్ర డీజీపీ జితేందర్‌తో కీలక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో సాంకేతిక పోలీసింగ్, సైబర్ భద్రత, మహిళా ఉద్యోగుల రక్షణ, ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల భద్రతా సహకారంపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, “ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల మధ్య భద్రత విషయంలో అంతరాన్ని తగ్గించడమే ఈ సమావేశ ఉద్దేశం. పరిశ్రమల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తాం,” అని చెప్పారు.
వాణిజ్య రంగంలో మారుతున్న సవాళ్లకు తగిన విధంగా స్పందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ముందడుగు వేస్తోందని డీజీపీ తెలిపారు. ముఖ్యంగా సైబర్ ఫ్రాడ్ నేరాలను అరికట్టేందుకు ఐజీ ర్యాంక్ అధికారిని ప్రత్యేకంగా నియమించామన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. పరిశ్రమల్లో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం షీ టీమ్‌ను ఏర్పాటు చేయడం, వారి ప్రయాణ సౌకర్యార్థం షీ షటిల్ బస్సులు అందుబాటులోకి తేవడం వంటి చర్యలను వివరించారు. వేధింపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Also Read
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
గత ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు రూ.800 కోట్లు మంజూరు చేసినట్లు జితేందర్ తెలిపారు. 100 డయల్ సేవలు మెరుగుపడటంతోపాటు పోలీస్ పనితీరు దేశంలోనే కాక, అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటోందని పేర్కొన్నారు. “తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధి పోలీస్ భద్రతపై ఆధారపడి ఉంది. శాంతి భద్రతలను కాపాడడంలో మా బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తున్నాం,” అని డీజీపీ జితేందర్ తెలిపారు. ఈ సమావేశం వాణిజ్య, పరిశ్రమల రంగం నుంచి విశేష స్పందన పొందింది. భద్రత , నిఘాపై ప్రభుత్వ నిర్ణయాలు పరిశ్రమల విశ్వాసాన్ని పెంచుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది.
Ronald Rose : ఏపీకి కాదు… రోనాల్డ్ తెలంగాణలోనే..! సీనియర్ ఐఏఎస్ అధికారికి ఊరట..
తాజావార్తలు
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!