Maoists : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఇద్దరు నేతలు పోలీసులకు లొంగిపోయారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒకరు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న కాగా, మరొకరు బస్తర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన చౌదరి అంకూభాయ్. వీరిద్దరూ గత 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలంగా…
Malnadu Restaurant : హైదరాబాద్లోని మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పురోగతులు చోటుచేసుకుంటున్నాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నెట్వర్క్ను ఛేదించేందుకు ఈగల్ టీం కొనసాగిస్తున్న దర్యాప్తులో మళ్లీ ఇద్దరిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులైన హర్ష, సూర్య సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. సూర్య హైదరాబాద్ శివారులో ఉన్న ఒక రిసార్టులో వీకెండ్లకు డ్రగ్ పార్టీలను నిర్వహించేవాడు. మల్నాడు రెస్టారెంట్ను ఆధారంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేసే…
మీ ఫోన్ పోయిందా.. ఐతే దిగులు పడకంటి అంటున్నారు పోలీసులు. జస్ట్ సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేస్తే రికవరి చేస్తామని చెబుతున్నారు. అలా రికవరీ చేసిన ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు అందించారు. ఫోన్ పోయిన వెంటనే.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సీఈఐఆర్ పోర్టల్లో మీ ఫోన్ వివరాలు పొందుపరచండి.
శంషాబాద్ లో ఒ వ్యక్తి తన ఇంట్లో ఏకంగా గంజాయి మొక్కలను పెంచాడు. పెంచిన గంజాయి విక్రయిస్తాడా? అతనే సేవిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉట్పల్లి గ్రామంలో ఒ వ్యక్తి తన ఇంట్లో రెండు గంజాయి మొక్కలు పెంచాడు.
డ్రగ్స్ వల్ల మన దేశానికి.. రాష్ట్రానికి గౌరవం వస్తుందా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మన దేశాన్ని ఎదుర్కోలేం అనుకున్న వాళ్ళు.. కొందరు డ్రగ్స్ ఎంచుకుంటున్నారు. మన దేశస్థులు అలవాటు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. వాళ్ళ ఉచ్చులో పడదామా? అని అడిగారు.
డీజీపీకి బీజేపీ ఎమ్మేల్యే రాజా సింగ్ లేఖ రాశారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. బక్రీద్ 2025 సందర్భంగా పోలీసులు ఎన్ని ఆవులను రక్షించారు..? అని ప్రశ్నించారు. జంతువుల రవాణా, వధకు ఎన్ని పశువైద్య ధృవీకరణ పత్రాలు జారీ చేశారు? రాష్ట్రవ్యాప్తంగా అక్రమ గోవధను ఆపడానికి ఎలాంటి దీర్ఘకాలిక చర్యలు అమలు చేయబడుతున్నాయి? అని అడిగారు.
హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ పదో తరగతి చదువుతున్న బాలిక, ఆమె ప్రేమికుడు శివ, అతని తమ్ముడు కలిసి దారుణంగా తల్లి అంజలిని హత్య చేసిన ఘటన ఒక్కసారికి నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ రోజు ఆమె మృతదేహాన్ని సూరారంలోని డా.బీఆర్ అంబేద్కర్ భవన్కు తరలించారు. తెలంగాణ సాంస్కృతి సారధి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. మృతదేహాన్ని మహబూబాబాద్ తరలించారు. అయితే.. ఈ దారుణ ఘటనపై నిందితుడి…
2024-25 ఆర్థిక సంవత్సరానికి పాస్పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినందుకు గుర్తింపుగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలంగాణ పోలీసులకు "సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్"ను ప్రదానం చేసింది. జూలై 24, 2024న న్యూఢిల్లీలో జరిగిన పాస్పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో ఈ ప్రశంసా పత్రాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి ఐసీఎస్ స్వీకరించారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా హాజరై గుర్తింపు పత్రాన్ని అందించారు.
Gadwal Murder Twist: గద్వాల జిల్లా సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ప్రధాన కుట్రదారుడిగా పోలీసులు గుర్తించారు. తాజా దర్యాప్తులో అతను తేజేశ్వర్ హత్య తర్వాత తన భార్యను కూడా హత్య చేయాలనే పథకం వేసినట్టు వెల్లడైంది. తిరుమలరావు, ఐశ్వర్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. వివాహమైన 8 సంవత్సరాలయినా సంతానం లేని పరిస్థితుల్లో, ఐశ్వర్యతో పిల్లలు కనాలని అతనికి వాంఛ కలిగింది. ఈ…
పాస్పోర్ట్ దరఖాస్తుదారుల పోలీసు ధృవీకరణ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం అత్యుత్తమ ప్రదర్శనతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయానికి కారణం తెలంగాణ పోలీసులు అభివృద్ధి చేసిన VeriFast యాప్. ఇది పాస్పోర్ట్ ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా, పారదర్శకంగా, అత్యుత్తమమైన ప్రజాప్రయోజనకారిగా రూపుదిద్దుకుంది. విదేశాంగశాఖ తాజా జాతీయ గణాంకాల ప్రకారం, తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యంత వేగంగా పాస్పోర్ట్ ధృవీకరణను పూర్తి చేస్తూ, తక్కువగా మూడు పని దినాల్లోనే ఎక్కువశాతం కేసులను పరిష్కరిస్తున్నారు. Also…