Physical Harassment : వికారాబాద్ జిల్లా దోమ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ళ బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారయత్నానికి ఒడిగట్టాడో యువకుడు. బాలిక కేకలు వేయడంతో ఇంటి బయట ఉన్న తండ్రి పరుగెత్తుకు రావడంతో యువకుడు పరారయ్యాడు. దీంతో.. 100 డయల్ ద్వారా పోలీసులకు బాధిత బాలిక తండ్రి సమాచారం అందించాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు.
Harish Rao : మాగంటి గోపీనాథ్ ఆరోగ్యంపై హరీష్ రావు క్లారిటీ