హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. నిన్నటి వరకు కమిషనరేట్ కు ఒకే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉండేది. నేటి నుంచి జోన్ ల వారికి అమలు లోకి రానున్నాయి. సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో జోనల్ సైబర్ సెల్స్ అమలులోకి వచ్చాయి. ఇక పై ప్రతి జోన్ లో ఒక్కో సైబర్ సెల్ స్టేషన్ ఉంటుంది. కాగా.. గడిచిన 9 సంవత్సరాల్లో సైబర్ నేరాలు 786 % శాతం పెరిగాయి. 2016 లో 267 సైబర్ క్రైమ్ కేస్ లు ఉంటే 2024 లో 3111 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తర్వాత ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో 7 జోనల్ సైబర్ సెల్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. 7 సైబర్ సెల్ లో 61 సిబ్బంది నియమించారు. జోన్ డీసీపీ కిందనే సైబర్ సెల్స్ టాస్క్ ఫోర్స్ పని చేస్తుంది.
READ MORE: Pahalgam Terror Attack: భారత వ్యతిరేక ర్యాలీలో పహల్గామ్ సూత్రధారి.. వీడియో వైరల్..
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ ప్రసంగించారు. “జీఓ 50ద్వారా జోనల్ సైబర్ సెల్స్ (ZCC) ఏర్పాటు చేశాం. హైదరాబాద్ మహానగరంలో ఒక్క సైబర్ క్రైమ్ స్టేషన్ మాత్రమే ఉంది.. సైబర్ క్రైమ్ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు.. ప్రతి పిటిషన్ ని దర్యాప్తు చేయడానికే ZCC సిస్టమ్ ఏర్పాటు చేశాం.. 2015లో 351కేసులు నమోదు అయ్యాయి.. గత సంవత్సరం 3111 కేసులు నమోదు అయ్యాయి.. 35రకాల కేసులు నమోదు అవుతున్నాయి.. వాటిన్నింటిని గుర్తించాం.. సోషల్ మీడియా కేసులు ఎక్కువయ్యాయి.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 7జోన్స్ లాల్లో ZCC ని తీసుకొచ్చాం.. ZCC పని తీరు, పని భారాన్ని బట్టి సైబర్ క్రైమ్ స్టేషన్స్ త్వరలో ఏర్పాటు అవుతాయి.. ప్రతి స్టేషన్ లో సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేయడం వీలుకాదు.. డీసీపీ కార్యాలయాల్లో జోనల్ డీసీపీ పర్యవేక్షణలో ఇవి నడుస్తాయి.. ప్రతి జోన్లు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసాం.. ZCC కోసం ఒక్క ఎస్సై, 5గురు కానిస్టేబుల్స్, ఇద్దరు హోం గర్డ్స్ ఉంటారు.. ZCC లోనే వృత్తిరీత్య అంత టెక్నికల్ పరిజ్ఞానం పొందిన తర్వాతే సిబ్బందిని కేటాయించాము.. ZCC లో 25వేల కన్నా ఎక్కువ లక్ష వరకు దర్యాప్తు చేయనున్నారు.. 25వేల కాంటే తక్కువ ఉంటే లీగల్ ప్రోసెస్ ప్రకారం వెళ్తారు..” అని ఆయన వ్యాఖ్యానించారు.