Hyderabad Police : అదిరింది.. దుబాయ్‌లో హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ అవార్డు..!
- వరల్డ్ పోలీస్ సమ్మిట్‌లో హైదరాబాద్ పోలీసులకు అరుదైన గౌరవం
- డ్రగ్స్ నిర్మూలనలో విశేష కృషికి నార్కోటిక్ వింగ్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
- ఈ విజయం తెలంగాణకే కాదు, భారత పోలీస్ వ్యవస్థకూ గర్వకారణం: సీపీ సీవీ ఆనంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Police : హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దుబాయ్‌లో జరుగుతున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025లో హైదరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో విశేష కృషి చేసినందుకు గాను, ఎక్సలెన్స్ ఇన్ యాంటీ-నార్కోటిక్స్ అవార్డులో హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ అవార్డును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) డీజీ సీవీ ఆనంద్ దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అందుకున్నారు. ఈ అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్-2025కు ప్రపంచంలోని 138 దేశాల నుండి ప్రముఖ పోలీసు అధికారులు హాజరయ్యారు. వారి మధ్య హైదరాబాద్ పోలీసులు మొదటి స్థానంలో నిలవడం విశేషం.
Top Headlines @1PM : టాప్ న్యూస్
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, ఈ ప్రతిష్టాత్మక అవార్డును సాధించడంలో నార్కోటిక్ వింగ్‌లోని అధికారులు, సిబ్బంది అంకితభావం, కృషి ఎంతో ఉందని కొనియాడారు. వారి నిరంతర ప్రయత్నాల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. అంతేకాకుండా, ఈ విజయం కేవలం తెలంగాణ పోలీసులకు మాత్రమే కాకుండా, యావత్ భారతదేశ పోలీసు దళానికి గర్వకారణమని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్ పోలీసులు తమ సత్తా చాటడం దేశానికే గర్వకారణమని ఆయన అన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం హైదరాబాద్ పోలీసులు చేస్తున్న కృషికి ఈ అవార్డు ఒక నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Operation Sindoor: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఏర్పాటుపై కేంద్ర అభిప్రాయమిదే!
తాజావార్తలు
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!