ప్రజలను ఫైబర్ మోసాల నుంచి కాపాడడం తమ బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేంద్ర అన్నారు. HICC లో ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సైబర్ నేరాలు పెరిగిపోయాయని.. సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇటీవలే రాష్ట్రంలో దేశంలో వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. చాలామంది అమాయకులు మోస పోతున్నారన్నారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధానికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
Revanth Reddy New Year Wishes: కొత్త సంవత్సర 2025 సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలోనూ శుభం, సంతోషం నిండి, అన్ని మంచినీటులు కలగాలని వారు కోరుకున్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. Also Read: UnstoppableWithNBK : రెబల్ స్టార్ కు రామ్ చరణ్ ఫోన్.. ఎందుకంటే.? నవ వసంతంలో… విశ్వ…
తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము ఏమీ మార్చలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అనేక పార్టీలు అనేక ప్రతిరూపాలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాయన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు అధికారికంగా విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవం చేసుకుందామంటూ ప్రజలకు తెలిపారు.
D. Sridhar Babu: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన చికిత్స అందించడానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్ ప్రత్యేక నంబర్‌తో అనుసంధానించబడుతుంది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మాజీ గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తునందుకు బాధగా ఉంది.. కానీ తప్పడం లేదన్నారు. తెలంగాణ ప్రజలందరు నా అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ళు అని పేర్కొన్నారు. ఎప్పుడు తెలంగాణ ప్రజలను మరువను.. అందరితో కలుస్తూ ఉంటానని తెలిపారు. మరోవైపు.. తమిళనాడులో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమో దాటవేస్తూ వెళ్ళిపోయారు.
మోసపూరిత వాగ్దానాలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఆలోచించుకోవాలి అని పురందేశ్వరి కోరారు. ఇక్కడ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మాట తప్పారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా. తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మరోవైపు, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా…
తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. ప్రధానిని విమర్శించొద్దు అన్న కేసీఆర్ ఇప్పుడు అదే ప్రధాని పైన నీచాటినీచంగా మాట్లాడుతున్నారన్నారు. 1985 నుండి 2018 వరకు ఒక్కసారి ఓడిపోని వ్యక్తికి పీకే అవసరం ఎందుకు వచ్చిందన్నారు. ప్రజల నాడీ తెలియదా… నా కుట్రలు కుతంత్రాలు నడవడం లేదని.. పీకేను తెచ్చుకున్నారు. పీకే కన్నా మేధావులు తెలంగాణ ప్రజలు.దుబ్బాకలో బీజేపీ గెలిచింది, హుజూరా…