Revanth Reddy New Year Wishes: కొత్త సంవత్సర 2025 సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలోనూ శుభం, సంతోషం నిండి, అన్ని మంచినీటులు కలగాలని వారు కోరుకున్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: UnstoppableWithNBK : రెబల్ స్టార్ కు రామ్ చరణ్ ఫోన్.. ఎందుకంటే.?
నవ వసంతంలో…
విశ్వ వేదిక పై…
విజయ గీతికగా…
తెలంగాణ…
స్థానం… ప్రస్థానం ఉండాలని…
ప్రతి ఒక్కరి జీవితంలో…
ఈ నూతన సంవత్సరం…
శుభ సంతోషాలను నింపాలని…
మనసారా కోరుకుంటూ…
నవ వసంతంలో…
విశ్వ వేదిక పై…
విజయ గీతికగా…
తెలంగాణ…
స్థానం… ప్రస్థానం
ఉండాలని…ప్రతి ఒక్కరి జీవితంలో…
ఈ నూతన సంవత్సరం…
శుభ సంతోషాలను నింపాలని…మనసారా కోరుకుంటూ…
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. #HappyNewYear2025 #HappyNewYear— Revanth Reddy (@revanth_anumula) January 1, 2025
Also Read: GameChanger : గేమ్ ఛేంజర్ ట్రైలర్ డేట్, టైమ్ లాక్
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతితో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించుకునే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను మెరుగుపరచుకోవాలని కేసిఆర్ కేసిఆర్ సూచించారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు మరింత కృషి చేయాలని కేసీఆర్ కోరారు. వీరితో పాటు పలు ప్రముఖులు, మంత్రులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.