తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా. తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మరోవైపు, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా వీరిరువురూ తెలుగులో శుభాకాంక్షలను తెలియజేయడం విశేషం.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణా సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణా రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) June 2, 2022
ట్విట్టర్ ద్వారా మోడీ స్పందిస్తూ.. ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణ రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను’ అని తెలిపారు.
దేశ ప్రగతి కోసం కట్టుబడిన యువత కృషితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని కోరుతూ..
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.— Amit Shah (@AmitShah) June 2, 2022
‘దేశ ప్రగతి కోసం కట్టుబడిన యువత కృషితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని కోరుతూ… తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.
మరోవైపు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు! సుసంపన్నమైన సంస్కృతి మరియు వారసత్వంతో ఆశీర్వదించబడిన తెలంగాణ అభివృద్ధి సూచికలలో ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది మరియు పరిశ్రమలకు కేంద్రంగా ఆవిర్భవించింది. ఇది నిరంతరం అభివృద్ధి చెందాలని మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నా అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Greetings to the people of Telangana on Statehood Day! Blessed with rich culture and heritage, Telangana has made commendable progress on development indicators and emerged as a hub for industries. I wish it continues to prosper & fulfil people's aspirations.
— President of India (@rashtrapatibhvn) June 2, 2022
Tamilisai Soundararajan: రాష్ట్రానికి గవర్నర్ కాదు.. మీ అందరికి