ఉదయం తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర్ రాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపారు. తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై కొనసాగిన విషయం తెలిసిందే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి చెన్నైకు బయల్దేరారు.
CM Revanth: ముంబై నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మాజీ గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తునందుకు బాధగా ఉంది.. కానీ తప్పడం లేదన్నారు. తెలంగాణ ప్రజలందరు నా అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ళు అని పేర్కొన్నారు. ఎప్పుడు తెలంగాణ ప్రజలను మరువను.. అందరితో కలుస్తూ ఉంటానని తెలిపారు. మరోవైపు.. తమిళనాడులో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమో దాటవేస్తూ వెళ్ళిపోయారు.
Raghunandan Rao: పెద్ద పదవులు అనుభవించి.. పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతారా..?
ఇదిలా ఉంటే.. చెన్నై సెంట్రల్ నుంచి బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. కన్యాకుమారి.. తమిళిసై సొంత జిల్లా.. పైగా కన్యాకుమారి, తిరునల్వేలి, చెన్నై సెంట్రల్ స్థానాల్లో ఒక స్థానం నుంచి ఏదో ఒక స్థానంలో తమిళిసై పోటీ చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. గతంలో తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో రెండుసార్లు ఓటమి పాలయ్యారు. 2009లో తొలిసారి చెన్నై నార్త్ నుంచి పోటీ చేసిన ఆయన.. 2019లో తూత్తుకుడి నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగినా ప్రజలు ఆదరించలేదు. అయితే, ఆమె పార్టీకి చేసిన సేవలను గుర్తించిన బీజేపీ నాయకత్వం ఆమెను తమిళనాడు గవర్నర్‌గా నియమించింది.