R.Krishnaiah : కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత మంది మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని… కాంట్రాక్టర్ల నుండి 8 నుండి 14 శాతం కమిషన్ లు తీసుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బిసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని , మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన ఇప్పటి వరకు ఫీజు బకాయిలు రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఫీజు బకాయిల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం పనికిరాదన్నారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తే , ప్రభుత్వానికే నష్టమని ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆ పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని , పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిల కోసం ఈ నెల 3న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లు ముట్టడికి ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు.
Keeravani: ఇళయరాజా సంగీత దర్శకత్వంలో కీరవాణి రాసిన పాట..విన్నారా?