Ponnam Prabhakar : సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జేబీఎస్ (జూబ్లీ బస్ స్టాండ్) లో ప్రయాణికులతో ముచ్చటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బస్ స్టేషన్‌లో టాయిలెట్స్ పరిశీలించారు.. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా డ్రైవర్ లతో మాట్లాడి రోడ్డు భద్రత పై అవగాహన కల్పించాలని సూచించారు.. క్యాంటీన్ లో ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడారు.. క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. Jbs లో ఉన్న కార్గో సెంటర్ ను పరిశీలించారు.. రోజూ ఇక్కడి నుండి వెళ్ళే ప్రయాణికులు సంఖ్య కార్గో ,పార్శిల్ లు ఎన్ని తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు..
Karnataka: వీడు మనిషా మృగమా.. పిల్లలను చంపి, తన భార్యను కూడా చంపాలనుకున్నాడు
JBSలో శానిటేషన్ సిబ్బంది తో మాట్లాడారు … బస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండలని సూచించారు. బస్ స్టేషన్ లో ఉన్న షాపులను పరిశీలించారు . షాపులలో నాణ్యమైన ఆహార వస్తువులు ఉండాలని,కాలం చెల్లిన ఆహార వస్తువులు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.. స్టాల్స్ లో అదనపు రేట్లకు వస్తువులు అమ్మరాదని ఒకవేళ అలాంటి పిర్యాదులు వస్తె చర్యలు తప్పవని హెచ్చరించారు.. డ్రింకింగ్ వాటర్ ను పరిశీలించారు.. ఫ్లాట్ ఫాం లను పరిశీలించారు. ఫ్లాట్ ఫాం లపై డిస్ ప్లే బోర్డులు కనిపించే విధంగా ఉండాలని సూచించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దురషెట్టి ఇతర అధికారులు ఉన్నారు..
Minister Ratnesh Sada: మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మంత్రిని ఢీకొన్న ఆటో..