కష్టపడిన వారికే ప్రాధాన్యత: 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని పార్టీ ముఖ్య నాయకులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని సూచించారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ప్రోత్సహించాలని, పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని సీఎం పేర్కొన్నారు. త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులకు నియామకాలు జరుగుతాయని చంద్రబాబు తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీలు,…
Kishan Reddy : నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారతమాత మహాహరతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతమాత మహారథి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ వర్మకి అలాగే సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డ్ గ్రహిత ఎంఎం కీరవాణి , ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం చే గుర్తించబడిన మాడుగుల నాగఫణి శర్మ, ఈటల రాజేందర్, రఘునందన్, విశ్వేశ్వర్ రెడ్డి,…
విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారు: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాజ్యసభ స్థానానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయటం బాధాకరం అని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ కష్ట కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అండగా నిలబడ్డారన్నారు. రాజ్యసభ పోయినా పర్లేదు, పార్టీకి సేవ చేయమని తాను కోరుతున్నానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు విజయసాయి రెడ్డి శనివారం…
నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్ట్: విశాఖ నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ ఐఏఎస్‌లుగా అవతారం ఎత్తిన భార్య, భర్తల మోసాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. భర్త జీవీఎంసీ కమిషనర్‌గా, భార్య హెచ్ఆర్సీ జాయింట్ కలెక్టర్‌గా మోసాలకు పాల్పడ్డారు. వంగవేటి భాగ్య రేఖ అలియాస్ అమృత, మన్నెందొర చంద్రశేఖర్‌లు కలిసి టిడ్కొ ఇల్లులు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేశారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నకీలి ఐఏఎస్ జంట టిడ్కో…
అమరావతి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. ఉదయం 8.45 గంటలకు రిపబ్లిక్ డే పెరేడ్ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుండగా.. వైసీపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. విజయవాడలో…
తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ రైతాంగం, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభించనున్నారు.
HP: సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని ఆత్మకూరులోని HP పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజల్ పంపుల్లో గమనించిన మోసంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజల్ పంపుల నుంచి ఇంధనం రాకపోయినా పరికరంలో చూపించే మీటర్ తిరుగుతూ అమౌంట్ చూపిస్తూ ఉంది. పెట్రోల్, డీజల్ ధరను వాస్తవానికి తగినంత చూపించకుండానే అమౌంట్ చూపిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. వాహనదారులు ఈ మోసాన్ని గమనించి పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అయితే, సిబ్బంది దీనిని ఒక “టెక్నికల్ ప్రాబ్లమ్”…
వచ్చే నెలాఖరులోగా రాజధాని నిర్మాణాలు ప్రారంభం: వచ్చే నెలాఖరులోగా రాజధాని నిర్మాణాలు ప్రారంభం అవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నెలాఖరుకు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తవుంటుందని, ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం అని చెప్పారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం అని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. నేడు రాజధాని ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. నేలపాడులో ఐకానిక్ బిల్డింగ్ పునాదులను పరిశీలించారు. పునాదుల్లోకి నీరు చేరడంతో మిషన్ సహాయంతో నీటిని బయటకు పంపుతున్న కార్యక్రమాన్ని…
Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలకు ఘోర ప్రమాదం జరిగింది. నేడు మంత్రి హుజూర్నగర్ నుండి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తున్న కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో 15 కార్ల ముందు భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. Also Read: Kaushik Reddy: గ్రామసభలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యేపై టమాటాలతో దాడి నల్గొండ జిల్లా గరిడేపల్లి వద్ద ఉత్తమ కుమార్ రెడ్డి కాన్వాయ్ వెంట వెలుతున్న కాంగ్రెస్ నేతల వాహనాలు…
Kaushik Reddy: నేడు జరుగుతున్న కమలాపూర్ గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సభ కాంగ్రెస్ నాయకులు, BRS నాయకుల మధ్య ఘర్షణకు దారితీసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లిస్ట్‌పై అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమయంలో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. “మీ హయాంలో ఏమి చేయలేదని, మా ప్రభుత్వం అన్ని చేస్తోంది” అని…