Bhatti Vikramarka : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల అమలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతుందని, ప్రజలు ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతాయని…
DCP KantiLal Subhash : హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్‌ను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ రాజు వద్ద నుండి 62 కేజీ ల గంజాయి సీజ్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ మాట్లాడుతూ… అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ రాజును పట్టుకున్నామని తెలిపారు. గాజువాక చెందిన రాజు ఐస్ క్రీమ్ బిజినెస్ చేస్తున్నాడని, ఈజీ మనీకోసం రాజు గంజాయి…
Uttam Kumar Reddy : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి, అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర పౌరసరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ తో కలసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈనెల 23 నుండి 25 వరకు జరగనున్న ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు ఉత్తమ్…
నారా లోకేష్ వంద శాతం అర్హులు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ రోజుకు రోజుకు పెరుగుతోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కడప జిల్లా బహిరంగ సభలో లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కూడా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో…
ఏపీపై బీజేపీ స్పెషల్ ఫోకస్: ఇప్పటికే అత్యధిక రాష్ట్రాల్లో పాగా వేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏపీలో పార్టీ ఎదుగుదలకు బీజేపీ కేంద్ర నాయకత్వం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో కంటే భిన్నంగా మోడీ సర్కార్ ఏపీ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమిలో ఉంటూనే.. రాష్ట్రంలో సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పార్టీ పరంగా ప్రక్షాళన చేయడానికి సిద్దమైంది. బీజేపీ పార్టీకి…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించి.. ఏపీ బీజేపీ కొత్త సారథిపై చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. నేడు దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఏపీ సీఎం ఇవాళ అర్ధరాత్రి ఢిల్లీ నుంచి జ్యురిచ్ బయలుదేరనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో నాలుగు రోజుల పాటు ఆయన పాల్గొననున్నారు. రాజమండ్రి సత్యసాయి గురుకులంలో సాయంత్రం 5 గంటలకు మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత…
Thatikonda Rajaiah : స్టేషన్ ఘనాపూర్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత లను తిట్టడం ఫ్యాషన్ అయ్యిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో ఆ నలుగురి దగ్గర అంతరంగికుడిగా ఉన్న కడియం.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం విడ్డూరమన ఆయన మండిపడ్డారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి, పార్టీకి పుట్టిన పిల్లలను.. కాంగ్రెస్ పార్టీ పిల్లలు అనడం హాస్యాస్పదమని…
మనం కూడా మంచి ఫలితాలు సాధించాలి: కొన్ని దేశాలు వ్యర్ధాలతో అద్భుతాలు చేస్తున్నాయని, ఏపీలో కూడా ‘స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2048 నాటికి రాష్ట్రం అద్భుతమైన పురోగతి కోసం కృషి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అని, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ…
తిరుమల భక్తులకు అలర్ట్: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్లను జనవరి 18న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. టికెట్ల కోసం జనవరి 18 నుంచి 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో…
నేటి నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కిడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేడు మైదుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 10:30కు ఉండవల్లి నివాసం నుండి 11:05 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు కెఎస్సి కళ్యాణ…