Minister KTR: తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్ ప్రభుత్వాలు ఇంధనాలపై అధిక వ్యాట్ వసూలు చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఖండించారు. అయితే ఆయా రాష్ట్రాల్లో ప్రజలపై పెట్రో ఎక్కువగా పడుతుందని లోక్‌సభలో కేంద్ర మంత్రి పేర్కొనడాన్ని ట్విట్టర్ వేదిక కేటీఆర్ విమర్శించారు. కాగా.. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఇంధన ధరలు పెరిగాయని ఆరోపించిన కేటీఆర్, 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ పెంచలేదని స్పష్టం చేశారు.
Read also: Missing Child Case: బాలిక మిస్సింగ్ విషాదాంతం.. చెరువులో మృతదేహం
అంతేకాకుండా.. కేంద్ర ప్రభుత్వం సెస్‌ను తొలగిస్తే పెట్రోల్ రూ.70కి, డీజిల్ రూ.60కి అందిస్తామని చెప్పారు. అయితే.. కేంద్ర సెస్ వల్ల రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన 41శాతం వాటా కోల్పోయమన్నారు. దీంతో.. ఇప్పటికే సెస్ రూపంలో వసూలు చేసిన రూ.30లక్షల కోట్లు సరిపోవా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే.. దేశంలో బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న ఆరు రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించలేదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ గురువారం లోక్‌సభలో వెల్లడించిన విషయం తెలిసిందే. దీనివల్లే ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు హర్దీప్ సింగ్ గుర్తుచేశారు. ఈసందర్భంగా.. దీనికి కొనసాగింపుగా కొన్ని రాష్ట్రాలు ప్రజలపై భారం తగ్గించడం కోసం వ్యాట్ ను సైతం తగ్గించాయని తెలిపారు. ఆయన మాట్లాడిన మాటలను కేటీఆర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
Dear Puri Ji,
Fuel prices have shot up only because of NPA govt
Name-calling states for not reducing VAT even though we NEVER increased it; is this the co-operative federalism PM Modi Ji talks about?#Telangana hasn't increased VAT on fuel since 2014 & rounded off only once https://t.co/zmecWoKTtB
— KTR (@KTRTRS) December 15, 2022