హైదరాబాద్‌లో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇవాళ ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిముద్దయ్యారు. భారీ వర్షం వల్ల రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మునుగోడుపై సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. రేపు అభ్యర్థి అధికారికంగా ప్రకటించే అవకాశం
Telangana National Unity Vajrotsavam: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు (శుక్రవారం) రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 15 వేల మందితో జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…
కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులతో డీజీపీతో మహేందర్‌రెడ్డితో కలిసి CS సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 16, 17,18 తేదీల్లో నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వక్రోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని CS అధికారులను ఆదేశించారు. భాగస్వామ్యం చేసి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రేపటి నుంచి (16)వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. Read also:National Integrations…
Kakatiya Mega Textile Park: కాకతీయ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ ఆరేళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో చీరల తయారీ ప్రారంభమైంది. ఈ పార్క్‌ను చేనేత మరియు జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది. హన్మకొండ జిల్లా మడికొండ గ్రామంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఈ పార్క్‌ను 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అక్కడ 364కి పైగా పవర్ లూమ్ యూనిట్లు ఉన్నాయి.
New Director to NIMS: నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)కి కొత్త డైరెక్టర్ రానున్నారు. ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ మనోహర్.. గుండె పోటుతో నాలుగు రోజుల కిందట హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకి ఆ ఆస్పత్రిలోనే సర్జరీ చేయనుండటం, దీనివల్ల దీర్ఘకాలం ట్రీట్మెంట్ పొందాల్సి ఉండటంతో నిమ్స్‌కి కొత్త డైరెక్టర్ని నియమించకతప్పని పరిస్థితి నెలకొంది.