Telangana Assembly: తెలంగాణ శాసన సభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 6 నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలను ఎప్పటివరకు కొనసాగించాలనేది ఆ రోజు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్లో నిర్ణయిస్తారని అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తెలిపారు. అజెండాను కూడా ఆ రోజే చర్చించి ఖరారు చేస్తారని చెప్పారు. మునుగోడు శాసన సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి
ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఇబ్రహీం పట్టణంలో జరిగిన ఘటన చాలా బాధాకరమని తెలిపారు. వెంటనే మా అధికారులు స్పందించారు. 30 మందిలో కొంత మంది ను నిమ్స్, అపోలో ఆస్పత్రికి తరలించామన్నారు. ఇప్పుడు అందరూ సేఫ్ గా ఉన్నారన్నారు. నిమ్స్ లో 17 మంది ఉన్నారని తెలిపారు. అపోలో ఆస్పత్రిలో 13 మంది ఉన్నారన్నారు. రెండు మూడు రోజులలో అందరిని డిశ్చార్జ్ చేస్తున్నామన్నారు. 5, 6 ఏళ్లలో 12 లక్షల అపరేషన్…
First Water School in Hyderabad: జలక్రీడలకు సంబంధించిన శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి వాటర్ స్కూల్ని హైదరాబాద్లో నిన్న ప్రారంభించింది. ఈ ఎక్స్క్లూజివ్ స్కూల్ని మాదాపూర్లోని దుర్గం చెరువు ప్రాంతంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మునిసిపల్ వ్యవహారాలు-పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆరంభించారు. సెయిలింగ్, కయాకింగ్, విండ్ సర్ఫింగ్, స్టాండప్ ప్యాడ్లింగ్తోపాటు ఇతర జల అనుబంధ క్రీడలను ఇక్కడ నేర్పిస్తారు.
Doli Updated Version: ఏజెన్సీ ఏరియాల్లో, ఎత్తైన కొండ ప్రాంతాల్లో రోగాల బారినపడ్డవారిని, పురిటి నొప్పులతో బాధపడే గర్భిణులను సమీప ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లాలంటే డోలీ మాత్రమే ఏకైక రవాణా సాధనం. సరైన రోడ్డు మార్గం లేకపోవటం వల్ల స్థానికులు వీటిలోనే పేషెంట్లను భుజాలపై మోసుకుంటూ వెళతారు.
Good News From Basara IIIT: తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ నుంచి ఈ మధ్య ఎక్కువగా బ్యాడ్ న్యూసే వస్తున్నాయి. ఇటీవల ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని, కొంత మంది స్టూడెంట్లు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారని రకరకాల వార్తలు వచ్చాయి. వాటిని వింటున్నా, చూస్తున్నా చాలా బాధనిపించేది.
కాంగ్రెస్ లో మునుగోడు ఎన్నిక వివాదం ముగిసినట్లు కనిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రచారంలో పాల్గొంటారా? అన్న దానిపై సస్పెన్స్ వీడింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటానని వెంకట్రెడ్డి ప్రకటించారు. పార్టీ ఎప్పుడు పిలిచినా ప్రచారానికి వెళ్తానన్నారు. మునుగోడు ప్రచారానికి వెళ్లనని తొలుత చెప్పిన వెంకట్రెడ్డి.. ప్రియాంక గాంధీతో భేటీ తర్వాత తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈవిషయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో జరిగిన భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మునుగోడు…
CM KCR-TRS: కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను ఆయన సమీక్షించినట్లు సమాచారం.