నేడు ఈడీ విచారణకు రోహిత్ రెడ్డి
వ్యాపార లావాదేవీలు, బ్లాక్ మనీ వ్యవహారంలో నేడు ఈడీ విచారణకి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయంకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలతో హాజరుకానున్నారు. 2015 ఏప్రిల్ నుండి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అందించాలని ఈడీ కోరింది. ఆధార్ కార్డు నుండి పాస్ పోర్టు వరకు 10 అంశాల బయోడేటా వివరాలతో విచారణకు రావాలని ఆదేశించింది ఈడీ. పైలెట్ రోహిత్ రెడ్డి విద్యార్హతలు, కేసుల వివరాలను ఈడి ఇచ్చిన ఫార్మాట్లో సమర్పించాలని ఆదేశం జారీచేసింది. ఎన్నికల అఫిడవిట్ లో విద్యార్హతలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. విద్యార్హతలు పత్రాలతో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులో పేర్కొంది. విచారానికి వచ్చే సమయంలో పాస్పోర్ట్ తో సహా విచారణ హాజరు కావాలని ఈడీ కోరింది. విదేశీ పర్యటనలపై ఈడీ ఇచ్చిన ఫార్మెట్లో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది.
ఎన్టీవీ చేతిలో ట్రిపుల్ ఐటీ విద్యార్థి సూసైడ్ నోట్
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పీ2 విద్యార్థి భానుప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడంతో బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. భాను ప్రసాద్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. అక్కడున్న విద్యార్థులు భాను గది తలుపులు కొట్టిన ఎంతసేపటికి తెరవక పోవడంతో గట్టిగా తలుపులు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా భాను ఫ్యానుకు వేలాడుతుండటంతో షాక్ తిన్న విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. దీంతో యాజమాన్యం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి భాను మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. విద్యార్థి మృతి నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థులంతా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదుట బైఠాయించారు. అధ్యాపకుల ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు ఆరోపించారు. భాను ప్రసాద్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా మంచేల్ మండలం రంగాపూర్ గ్రామం.
భర్తను హత్యచేసి పోలీసులకు చుక్కలు చూపించిన భార్య
భర్తను దారుణంగా చంపేసింది ఓభార్య. భర్త వేధింపులు భరించలేక ఈ దారుణానికి పాల్పడింది. భర్త పరాయి మహిళలతో ఉండటమే కాకుడా..వారితో ఉన్న వీడియోలు తీసి భార్యకు చూపిస్తూ పైశాచికానందం పొందుతున్నాడు. ఈ వేధింపులు భరించలేక భార్య ఆవేశంతో భర్తను హతమార్చిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. బంధువుతో కలిసి భర్త వేణు కుమార్ ను చంపించి భార్య సుస్మిత ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండ్రోజులకు ఒకసారి ఖాకీల ఎదుట కన్నీటిపర్వంతమై నా భర్తను నావద్దకు చేర్చండి అంటూ వేడుకునేది. కాల్ డేటా ఆధారంగా కూపీ లాగిన పోలీసులు మృతుడికి వివాహేతర సంబంధల కారణంతో భర్తను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.
బీహర్‌లో కుప్పకూలిన బ్రిడ్జి
కొన్ని బ్రిడ్జ్‌లు ఏళ్లు గడిచినా.. చెక్కు చెదరకుండా ఉంటాయి.. మరికొన్ని కనీసం ప్రారంభోత్సవానికి కూడా నోచుకోకుండానే కుప్పకూలిన సందర్భాలు ఉంటాయి.. అలాంటి ఘటనే ఇప్పుడు బీహార్‌లో జరిగింది.. బెగుసరాయ్‌లో గండక్ నదిపై నిర్మించిన 206 మీటర్ల పొడవైన వంతెన… నిన్న కుప్పకూలింది. బ్రిడ్డ్ ముందు భాగం కూలి నదిలో పడిపోయింది.. అయితే, ఆ బ్రిడ్జి ఇంకా ప్రారంభించలేదు.. ముందే ఇలా జరగడంతో అంతా షాక్ తిన్నారు.. అయితే, అహోక్ గండక్ ఘాట్ నుంచి ఆక్రిత టోల చౌకి, బిషన్‌పూర్ మధ్య ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు.. 2016లో పనులు ప్రారంభించి 2017లో నిర్మాణాన్ని పూర్తి చేశారు.. దీని కోసం రూ.13 కోట్లు ఖర్చు చేశారు..
మిడుతూరు పీఎస్‌పై దాడి..! 14 మందిపై కేసు
నంద్యాల జిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది.. స్థానిక రాజకీయనాయకుని వాహనానికి సైడు ఇవ్వలేదని ట్రాక్టర్ డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఏఎస్సై కొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.. ఇక, తన బావకోసం వెళ్లిన మహిళను కూడా కొట్టారని.. ఆ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలుస్తోంది.. ఏఎస్సై మద్యం సేవించి కొట్టినట్లు బాధిత మహిళ వాపోయింది.. దీంతో, పెద్ద ఎత్తున పీఎస్ దగ్గరకు చేరుకున్న మహిళా బంధువులు.. స్టేషన్ ముందు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. దీంతో, మిడుతూరు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, పీఎస్‌పై దాడికి యత్నించారని పోలీసులు చెబుతున్నారు.. 14 మందిపై కేసు నమోదు చేశారు..
చైనాలో కరోనా విజృంభణ
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.. కొంతకాలంగా కొవిడ్ కేసులు గణనీయంగా పెరగడంతో.. అక్కడి ప్రభుత్వం జీకో కొవిడ్ ఆంక్షల్ని అమలు చేసింది. అయితే, ఆ ఆంక్షలు కఠినంగా ఉండటం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. వాటిని సడలించాల్సిందిగా కోరుతూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మరో దారి లేక.. జీరో కొవిడ్ ఆంక్షల్ని ప్రభుత్వం సడలించింది. ఈ దెబ్బకు అక్కడ మళ్లీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఇలాగే వదిలేస్తే.. వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నాటికి చైనాలో కొవిడ్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు హెచ్చరించాయి..
ఆ స్టేజ్ పైన అయినా అప్డేట్ ఇస్తారా సర్?
పుష్ప 2 అప్డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఏడాది కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యి పాన్ ఇండియా హిట్ అయ్యింది, పార్ట్ 2 కోసం ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేయడానికి సుకుమార్ ప్రయత్నిస్తూ కనిపించట్లేదు. బన్నీ అభిమానులని ఊరిస్తున్న సుకుమార్, పార్ట్ 2 షూటింగ్ ని కూడా మొదలుపెట్టలేదు. పుష్ప 2 అప్డేట్ కోసం ఫాన్స్ ర్యాలీలు చేస్తుంటే, చిత్ర యూనిట్ మాత్రం రష్యాలో పుష్ప పార్ట్ 1ని రిలీజ్ చేశారు. పార్ట్ 1కి పాన్ ఇండియా షేక్ అయ్యింది, పార్ట్ 2తో మార్కెట్ మరింత పెరగనుంది అనే హింట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప 2ని కనీసం 2023లో స్టార్ట్ చేసి, అదే ఏడాదిలో రిలీజ్ చేస్తారా అనే ప్రశ్నకి ఎవరికీ సమాధానం తెలియట్లేదు.
ట్రైలర్ తోనే తన మ్యాజిక్ చూపించిన ‘క్రిస్టోఫర్ నొలన్’
మైండ్ బెండింగ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రెస్ ‘క్రిస్టోఫర్ నొలన్’. ఎంతటి సినీ అభిమానులైనా, ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సినీ క్రిటిక్స్ అయినా, ఆఖరికి ఫిల్మ్ మేకర్స్ అయినా సరే ‘క్రిస్టోఫర్ నొలన్’ సినిమాలని ఒకసారి చూడగానే అర్ధం చేసుకోవడం అనేది ఇంపాజిబుల్. ఒకటికి రెండు సార్లు చూస్తేనే నొలెన్ సినిమాలో ఉన్న డెప్త్ అర్ధం అవుతుంది. స్క్రీన్ ప్లే మాస్టర్ అని పేరు తెచ్చుకున్న క్రిస్టోఫర్ నొలన్, లేటెస్ట్ గా డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ఓపెన్‌హీమర్’. అణుబాంబు పితామహుడుగా పేరు తెచ్చుకున్న అమెరికా భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త ‘జులీయస్ రాబర్ట్ ఓపెన్‌హీమర్’ (Julius Robert Oppenheimer) జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.