Top Headlines @1PM:
రేపు రామప్ప ఆలయానికి రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ములుగు జిల్లాలోని యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా రామప్ప దేవాలయం చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామప్ప ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి అలజడి జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు ప్రత్యేక హెలిప్యాడ్‌లను సిద్ధం చేశారు. రాష్ట్రపతి ప్రత్యేక భద్రతా సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ బృందం ఏర్పాట్లను పర్యవేక్షించింది. నేడు, రేపు రామప్పను దర్శించుకునేందుకు సాధారణ భక్తులను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప ఆలయ సందర్శన దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు.
ఈడీ విచారణకు గైర్హాజరు.. వివరణ ఇచ్చిన రోహిత్ రెడ్డి
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. నేడు విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గతం లోనే ఈడీ నోటీస్ లు ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఇవాళ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు వెళతారా అనే ఉత్కంఠం రేపుతున్న నేపథ్యంలో రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు గైర్హాజరు పై సర్వత్రా చర్చకు దారితీసింది. ఈడీ విచారణకు గైర్హాజరుపై రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు. నిన్న హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. రేపు పిటిషన్ బెంచ్ మీదకు వస్తుందని తెలిపారు. ఈరోజు ఈడి విచారణకు వెళ్ళాలా వద్దా అనేది మా న్యాయవాదులతో చర్చిస్తానని అన్నారు. మా న్యాయవాదులు ఎలా చెప్తే అలా చేస్తానని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈడికి నేరుగా హాజరుకావాలన్న అటెండ్ అవుతాను.. లేదా ఎవరినైన పంపి లేఖ ఇవ్వామన్న ఇస్తానని పైలట్ రోహిత్ రెడ్డి తెలపడంతో సర్వత్రా ఉత్కంఠంగా మారింది.
Read also: Droupadi Murmu: శక్తి లేకుండా శివుడు సంపూర్ణంగా లేడు
ఫించన్‌లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు- సీఎం జగన్
అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వివిధ కారణాలతో పథకాలు అందక మిగిలిన పోయిన అర్హులకు ప్రభుత్వం చేయూత అందిస్తోంది. ఈ మేరకు 2,79,065 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.590.91 కోట్లను వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్ జమ చేశారు. ఏటా జూన్, డిసెంబర్ నెలలో పెండింగ్ దరఖాస్తుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ కొన్ని మీడియా సంస్థలపై మండిపడ్డారు. పింఛన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. .. నోటీసులు ఇస్తేనే పింఛన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు.
ఏపీ ప్రభుత్వానికి డిసెంబర్ 30 డెడ్‌లైన్ లేకుంటే..
కాపు రిజర్వేషన్‌ల అమలుపై మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామజోగయ్య ఏపీ ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. అగ్రవర్ణాల మాదిరిగా కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో డిసెంబర్ 30 వరకు సీఎం జగన్‌కు టైం ఇస్తున్నామని.. అప్పటివరకు కాపు రిజర్వేషన్‌ల అమలుపై స్పష్టత ఇవ్వకపోతే జనవరి 2 నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానని హరిరామజోగయ్య హెచ్చరించారు. తాను చచ్చి అయినా కాపులకు రిజర్వేషన్‌లు సాధించుకుని తీరతానని ఆయన స్పష్టం చేశారు. 2021లో కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేసి రిజర్వేషన్‌ల కోసం ఉద్యమిస్తున్నామని చెప్పారు.
Read also: RC 16: ప్రశాంత్ నీల్ శిష్యుడితో రామ్ చరణ్ సినిమా…
క్యాంపస్‌లో నమాజ్ చదివిన విద్యార్థులు.. వివాదం
గుజరాత్‌లోని ఒక యూనివర్శిటీలో ఇద్దరు విద్యార్థులు నమాజ్ చదవడం తీవ్ర దుమారం రేపుతోంది. వడోదరలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం (MSU) క్యాంపస్‌లో వాళ్లు నమాజ్ చదివిన వీడియో బయటకు రావడమే ఆలస్యం.. ఒక్కసారిగా వివాదం రాజుకుంది. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వెంటనే రంగంలోకి దిగి.. క్యాంపస్‌లో నమాజ్ చదవడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఎక్కడైనా నమాజ్ చదివారో, ఆ ప్రదేశంలో గంగాజలం చల్లారు. రామ్-ధున్ నిర్వహించి, వర్శిటీ వెలుపల హనుమాన్ చాలీసా పఠించారు.
ఇళ్లల్లో కత్తులు ఉంచుకోండి.. ప్రగ్యా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు..
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకెక్కే బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమని తాము రక్షించుకోవడం కోసం హిందూ సమాజం తమ ఇళ్లల్లో పదునైన ఆయుధాలు పెట్టుకోవాలని, అవి ఎప్పుడైనా అవసరం పడతాయని సూచించారు. ఒకవేళ ఆయుధాలు లేకపోతే.. కనీసం కూరగాయాలను కోసే కత్తులనైనా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కర్ణాటక శివమొగ్గలో జరిగిన హిందూ జాగరణ వేదిక సౌత్ రీజియన్ వార్షిక సదస్సులో ఆమె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకునే హక్కు హిందువులకు ఉందని చెప్పారు.
Read also:Ayesha Meera Mother: నిర్భయ తరహాలో అయేషా పేరుతో చట్టం తేవాలి
కన్నీళ్లు పెట్టుకున్న సుమ.. యాంకరింగ్‌కు బ్రేక్..?
యాంకర్ సుమ అంటే తెలియనివారే ఉండరు. 15 ఏళ్లుగా టాప్ యాంకర్‌గా సుమ తన హవా కొనసాగిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఆమెకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఓ పక్క బుల్లితెరపై రాణిస్తూనే వివిధ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకర్‌గా చేస్తున్న సుమ వెండితెరపైనా తనదైన రీతిలో నటిస్తోంది. జయమ్మ పంచాయతీ సినిమాతో తనలోని మరో కోణాన్ని అభిమానులకు చాటుకుంది. చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమా ఫంక్షన్‌లకు సుమ యాంకరింగ్ చేయాలని పట్టుబడుతుంటారు. అంతటి టాలెంట్, టైమింగ్ సుమకు మాత్రమే సొంతం. తాజాగా ఓ షోలో తాను యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పి సుమ అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఈటీవీలో న్యూ ఇయర్ సందర్భంగా ప్రసారం కానున్న షోలో పాల్గొన్న సుమ ఈ ప్రకటన చేసింది.
బాలయ్య-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ షురూ
రెండు పవర్ హౌజ్ లు కలిస్తే ఎలా ఉండబోతుందో చూపించడానికి అన్ స్టాపబుల్ సీజన్ 2 వేదిక సిద్ధమవుతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణలోని కొత్త యాంగిల్ ని ఆడియన్స్ ని పరిచయం చేసిన ఈ టాక్ సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. తరతరాలుగా మెగా నందమూరి అభిమానుల మధ్య ఇండస్ట్రీ పరంగా ఒక రైవల్రీ ఉంది. వచ్చే సంక్రాంతికి కూడా ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల కారణంగా మెగా నందమూరి ఫ్యాన్ వార్ జరగబోతోంది. ఈ వార్ బాక్సాఫీస్ వరకు మాత్రమే ఉంటుందని నిరూపిస్తూ పవన్ కళ్యాణ్, బాలకృష్ణలు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. సీజన్ 2కి ఎండింగ్ ఎపిసోడ్ లా పవన్ కళ్యాణ్, బాలయ్యల ఎపిసోడ్ ని టెలికాస్ట్ చెయ్యనున్నారు. ఈ క్రేజీ ఎపిసోడ్ షూటింగ్ ఈరోజు స్టార్ట్ అయ్యింది. గ్రాండ్ స్కేల్ లో చేసిన ఏర్పాట్లు మధ్య పవన్ కళ్యాణ్ ని బాలయ్య, అల్లు అరవింద్ లు రిసీవ్ చేసుకున్నారు.
Harirama Jogaiah: ఏపీ ప్రభుత్వానికి డిసెంబర్ 30 డెడ్‌లైన్.. లేకుంటే జనవరి 2 నుంచి నిరాహారదీక్ష