తెలంగాణ సచివాలయంలో అసంపూర్తిగా ఉన్న పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు.
రాష్ట్రంలో పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కర్నాటకలో ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవు?. సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీలకు ఎలా తెలుసు? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పరిపాలన వదిలి ప్రతిపక్షాలను వేధిస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. 8 రాష్టాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వలను పడగొట్టి దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కేంద్రం పరిపాలన మర్చిపోయిందని అన్నారు. సీబీఐ నోటీసులు ఇస్తుంది అని బీజేపీ ఎంపీ…
మహింద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వీరిద్దరూ నిత్యం ట్విటర్ లో యాక్టివ్ గా ఉంటారు. బుధవారం మంత్రి కేటీఆర్ జహీరాబాద్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా జహీరాబాద్ లోని మహీంద్రా ట్రాక్టర్ల తయారీ యూనిట్ ను కేటీఆర్ సందర్శించి ట్రాక్టర్ నడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. దీనికి ట్యాగ్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసారు. కేటీఆర్ హీరోలా…
బోదాన్ పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం సంతోషకరం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడున్నర ఏళ్లలోనే రామప్పకు- పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం గర్వంగా ఉంది. నిజాం ప్రభుత్వంలో అగ్గిపెట్టలో చీరను నేచిన ఘనత బోధాన్ పోచంపల్లిది. మేము చేసే ప్రయత్నాలకు ఫలితాలు వస్తే ముందుగా గుర్తింపు ఇండియాకు వస్తది. త్వరలోనే బుద్ధవనానికి అంతర్జాతీయ గుర్తింపు రాబోతోంది. ఇక అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. ఒక్కో రాష్ట్రాన్ని…
మంత్రి అంటే.. ఆయన శాఖకు సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన ఉంటుందని అనుకుంటాం. బాధ్యతలు చేపట్టిన కొత్తలో తెలియకపోయినా.. తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు కొందరు. మరి.. ఆ ప్రయత్నం చేయలేదో ఏమో.. సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నకు గుడ్లు తేలేశారట మంత్రి పువ్వాడ అజయ్. ఆ సందర్భంగా పేలిన డైలాగులపైనే ఇప్పుడు చర్చ. ఆర్టీసీ బస్సుల లెక్కలు అడిగితే బిక్కముఖం వేసిన మంత్రి అజయ్? టీఆర్‌ఎస్ ప్లీనరీ.. తెలంగాణ విజయ గర్జన సభపై మాట్లాడేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఊరు ఊరికో జమ్మి చెట్టు..గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా నేడు కీసర రామ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కీసర రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అదేవిధంగా తను దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ పెద్ద చెరువు దగ్గర జమ్మి చెట్లను మంత్రి మల్లారెడ్డితో కలిసి నాటారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… రాజ్యసభ సభ్యులు…
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లోని రాచపల్లి గ్రామంలో టీఆరెస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అసలు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయ్ ఒక్కసారి ఆలోచించాలి. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసాడు చెప్పాలి అన్నారు. మీకు పని చేసే వాళ్ళను గెలిపించండి. ఈటల లేనిపోని మాటలు…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు బీజేపీ నాయకులు కార్యకర్తలు. అక్కడ గంగుల కమలాకర్ మాట్లాడుతూ… రాష్ట్రం లో ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ కే ఉంది. బీజేపీ పార్టీ లో పని చేసే వాళ్ళను బయటికి వెళ్లగొట్టరు. విశ్వసనీయతకు వెన్నుపోటు కు మధ్యల జరిగే ఎన్నికలు ఇవి అన్నారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీ రోజురోజకీ హుజూరాబాద్ లో ఆదరణ…
చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన భారత ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్ మరియు మెరిట్ సర్టిఫికెట్ విజేతలు సాయిని భారత్, దుద్యాల శంకర్, తడక రమేష్ గార్లను చేనేత మంత్రి కేటీఆర్ అసెంబ్లీ లోని తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ తమ వృత్తి నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరుప్రఖ్యాతి తెచ్చిన అవార్డు గ్రహితులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం…
హుజురాబాద్ బైఎలక్షన్ ఆ ఇద్దరు మంత్రులకు పరీక్షేనా? వారి రాజకీయ భవిష్యత్ ఉపఎన్నిక ఫలితంపై ఆధారపడి ఉందా? అందుకే కంటిపై కునుకు లేకుండా పోయిందా? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇంతకీ ఎవరా మంత్రులు.. ఏమా కథా? హుజురాబాద్‌లో ఇద్దరు మంత్రులపై ఎక్కువ చర్చ..! హుజురాబాద్ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా ఉపఎన్నికల్లో నిలబెట్టుకోవాలన్నది అధికార టీఆర్‌ఎస్ ఆలోచన. ఈటల రాజేందర్ రాజీనామాను ఆమోదించిన మరుక్షణం గులాబీ శ్రేణులు ఇక్కడ మోహరించి పక్కా వ్యూహంతో వెళ్తున్నాయి. షెడ్యూల్…