మహింద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వీరిద్దరూ నిత్యం ట్విటర్ లో యాక్టివ్ గా ఉంటారు. బుధవారం మంత్రి కేటీఆర్ జహీరాబాద్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా జహీరాబాద్ లోని మహీంద్రా ట్రాక్టర్ల తయారీ యూనిట్ ను కేటీఆర్ సందర్శించి ట్రాక్టర్ నడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
దీనికి ట్యాగ్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసారు. కేటీఆర్ హీరోలా ఉంటారని ఆయన్ని టాలీవుడ్ చూస్తే లాక్కుంటుందంటూ సరదాగా కామెంట్ చేశారు. కేటీఆర్ యాక్టీవ్ గా ఉంటారని ఏం చేసినా అందరినీ ఆలోచింపజేస్తారని. సూట్ వేసుకున్నా ట్రాక్టర్ నడిపినా ఆయన తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా అనిపిస్తారంటూ ఆనంద్ మహీంద్రా తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు.
అయితే ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు రిప్లై ట్వీట్ లో కేటీఆర్ కూడా సరదాగా కామెంట్స్ చేశారు. తప్పకుండా కెమెరా ముందుకు వస్తానన్నారు. అయితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర ఉన్న మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ కోసం మరిన్ని పెట్టుబడులు పెడితే కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన యాడ్ లో నటిస్తానంటూ కేటీఆర్ తెలిపారు. దీంతో ఈ ఇద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సరదాగా సాగిన ఈ ట్వీట్లను టీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
You are a phenomenal brand ambassador, @KTRTRS , no doubt about that. My only concern is that you may be stolen by the skyrocketing Tollywood empire! 😊 https://t.co/Yz4gIbpYof
— anand mahindra (@anandmahindra) June 22, 2022