వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండి పడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకోసం పాదయాత్ర చేపడుతున్నాడు, ముందు తమ పార్టీ తెలంగాణ కు ఏమి ఇచ్చిందో చెప్పి పాద యాత్ర చేయాలని అన్నారు. సస్యశ్యామలం అయిన తెలంగాణలో అలజడులు సృష్టించేందుకు కొన్ని శక్తులు యాత్రల పేరుతో బయలుదేరాయని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలను దోచుకొని తింటున్న బీజేపీ పార్టీ…
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు నకిలీ ఈడి నోటీసులు పంపారు. తనను అరెస్ట్ చేస్తామంటూ ఈడి పేరుతో నకిలీ నోటీసులు పంపారు ఆగంతకులు. దాంతో ఈడి అధికారులని సంప్రదించారు మంత్రి గంగుల కమలాకర్. నకిలీ నోటీసుల పై సైబర్ క్రైమ్ పోలీసులుకు ఈడి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై 420,468,,471 కింద కేసు నమోదు చేసారు పోలీసులు. దర్యాప్తు లో భాగంగా మంత్రి గంగులకు పోలీసులు ఫోన్ చేయగా నకిలీ నోటీసులు పై ఫిర్యాదు…
విజయ దశమి సమయంలో పార్టీ కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభిస్తారు. 24,25 జిల్లాలో పార్టీ కార్యాలయల నిర్మాణం పూర్తి అయ్యింది అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసు నిర్మాణంకు వచ్చే నెల 2న కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతుంది అని అన్నారు. భూమి పూజ కార్యక్రమంకు రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరు అవుతారు అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న 12 వేళ 769 గ్రామ కమిటీల నిర్మాణము, 3854 వార్డు…
వచ్చే నెల 1 నుండి అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ విషయం పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… 17 నెలలుగా వ్యవస్థలు అన్ని అతలాకుతలం అయ్యాయి. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాము. వైద్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం చేస్తున్నాం. 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రతీ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని సీఎం…
రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను త్వరలో ప్రారంభిస్తాం అని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రుల ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఐటీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ హెల్త్ ప్రొఫైల్ రికార్డ్ ప్రాజెక్టు కోసం ములుగు, సిరిసిల్ల జిల్లాలను ఎంపిక చేసారు. ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే, వారికి అవసరమైన కార్యక్రమాలను చేపట్టడంలో ఉపయుక్తంగా ఉంటుంది.…
హుజూరాబాద్ సీఎం సభ స్థలిని పరిశీలించారు మంత్రులు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక అంతా ఒకేసారి జరుగుతుంది. మా జాతి బిడ్డల్లో చిచ్చుపెట్టే కుట్ర జరుగుతోంది. హుజూరాబాద్ కోసమే 2 వేల కోట్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అన్నారు. కాబట్టి ఆందోళన చెందకండి.. అందరికీ దళిత బంధు వస్తుంది. మొదట రైతు బంధు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే నిందలు వేశారు. ఇక ఇప్పుడు దళిత బంధు కూడా అందరికీ ఇచ్చి…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మంత్రి హరిష్ రావు మాట్లాడుతూ… ఎల్లుండి దళిత బంధు ప్రారంభం అవుతుంది. పైలెట్ ప్రాజెక్ట్ గా హుజురాబాద్ ను తీసుకున్నం అని తెలిపారు. బీజేపీ నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. దళిత బంధు పూర్తి దళిత బంధు కుటుంబాలకు అందిస్తాం. రైతు బంధు అమలప్పుడు కూడా ఇదే దుష్ప్రచారం చేశారు. రైతు బంధు కు చప్పట్లు కొట్టిన నేతలు, దళిత బంధు కు గుండెలు కొట్టుకుంటున్నారు. ఇక హుజురాబాద్ కోసం 2000…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కబ్జాలు లేవు, రౌడీ షీటర్లు లేరు. లా అండ్ ఆర్డర్ బాగుంది కాబట్టి అన్ని పరిశ్రమలు తరలివస్తున్నాయి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 15వేల ఐటీ కంపెనీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఆర్ఆర్ఆర్ రాబోతుంది.సెంట్రల్ ప్రభుత్వం తో మాట్లాడుతున్నాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు. తద్వారా ఈ రంగం మరింత అభివృద్ధి సాధిస్తుంది అని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్(RRR) విషయంలో లాండ్ సేకరణ 50…
నా రాజకీయ గురువు పెద్ది రెడ్డి. ప్రజలకు అన్నం పెట్టె కులం రెడ్డి కులం. రెడ్డి భవనం కోసం ఎకరం భూమి కోటిరూపాయలు మంజూరు చేసినట్లు హుజురాబాద్ జరిగిన సమావేశంలో గంగుల కమలాకర్ అన్నారు. నేను వ్యవసాయ కుటుంబం లో పుట్టిన వాడినే. నీళ్లు లేక పంటలు వెసుకోలేని రోజుల నుండి బీడుభూములు లేకుండ చేసారు కెసిఆర్. గతంలో పంటలు పండక పోవడంతో ఇంటి తలుపులు తీసుకుపోయాయి బ్యాంకులు. తెలంగాణ రాకముందు రాష్ట్రం గుడ్డి దీపంలాగా ఉండేది.…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆలోచించాలి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న పార్టీలు ఈ ప్రాంతానికి ఏం చేశాయి. ఆ పార్టీలు సంక్షేమం గురించి పట్టించుకున్నాయా అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు, నీళ్లు సరిగా ఉన్నాయా… నీళ్లు లేవు నీళ్లు ఉన్న కరెంటు లేదు. రైతుల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో మన…