Bharat Future City: రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంత భవిష్యత్తు హైదరాబాద్‌కు కేంద్రంగా మారబోతోంది. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ పేరిట రూపుదిద్దుకుంటున్న ఈ మహానగరానికి మరిన్ని కీలక ప్రాజెక్టులతో కొత్త ఉత్సాహం వస్తోంది. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు ఊపందుకుంటున్న వేళ, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మరిన్ని నిర్మాణాలకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. భవిష్యత్తు నగరాన్ని నిర్మించే బాధ్యతను ప్రభుత్వం FCDA (ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ)కి అప్పగించింది. ఈ…
హైదరాబాద్‌లో కనెక్టివిటీని బలోపేతం చేయడం, పరిశ్రమలు, ఐటీ హబ్‌లు , ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి దోహదం చేయడం లక్ష్యంగా రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లు, భవనాల (R&B) శాఖకు చెందిన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిపై ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే స్పందించారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో శ్రమ్ శక్తి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల స్థితి గురించి చర్చించారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అంశంపై చర్చ జరిగింది.
ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రావాలని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు చెప్పండని కోరారు. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా? అని ప్రశ్నించారు. మేము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. ఏ రోజు తాను సీఎంగా అహంకారానికి పోలేదని చెప్పారు. మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తామని.. ప్రపంచంలో తెలంగాణని గొప్ప రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని తెలిపారు. సంగారెడ్డి…
Nitin Gadkari: హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇరువురు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో సీఎం చర్చలు చేపట్టారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలుపాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని ఏకకాలంలో పూర్తి…
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత 10 సంవత్సరాలలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, అన్ని రాష్ట్రాల రాజధానులను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడానికి కేంద్రం కృషి చేస్తున్నది. ఈ నిర్మాణం వెనుక ఉన్న ముఖ్యమైన అంశం తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ. 2014 వరకు రాష్ట్రంలో…
ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ప్రాధాన్యతతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూమి సేకరణలో ఆలస్యం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. లక్షలాది ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడే…
Old City Metro : మెట్రో రైల్ విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో విస్తరణ పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రభావిత ఆస్తులను స్వాధీనం చేసుకుని, కూల్చి వేసే కార్యక్రమం స్థానికుల పూర్తి సహాయ సహకారాలతో ముమ్మరంగా సాగుతోందని ఆయన చెప్పారు. మొత్తం ఈ మార్గంలో 1100 ప్రభావిత ఆస్తుల ఉండగా ఇప్పటి వరకు ఈ మార్గంలో…
హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం, ప్రజలు ఎటువంటి అవాంతరాలు లేకుండా…