CM Revanth Reddy : హైదరాబాద్‌లో కనెక్టివిటీని బలోపేతం చేయడం, పరిశ్రమలు, ఐటీ హబ్‌లు , ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి దోహదం చేయడం లక్ష్యంగా రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ రహదారి రావిర్యాల్ ORR నుంచి అమంగల్ RRR వరకు విస్తరించి మొత్తం పొడవు 41.50 కిలోమీటర్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
Hyderabad : హైదరాబాద్ తాగునీటికి షాక్, నీట మునిగిన మంజీరా ఫిల్టర్ బెడ్.. ప్రజలకు ఇబ్బందులు
రహదారి నిర్మాణం రెండు దశల్లో జరుగుతుంది. ఫేజ్–1 లో రావిర్యాల్ నుంచి మీర్కాన్‌పేట్ వరకు 19.20 కిలోమీటర్లు, ఫేజ్–2 లో మీర్కాన్‌పేట్ నుంచి అమంగల్ వరకు 22.30 కిలోమీటర్లు నిర్మాణం చేయనున్నారు. రహదారి వెడల్పు 100 మీటర్లు, 4+4 లేన్లతో రూపకల్పన చేయబడింది. దీనిలో మెట్రో రైల్వే కారిడార్, సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు, సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మొత్తం 14 గ్రామాల మీదుగా రహదారి విస్తరించనుంది. ఫేజ్–1 నిర్మాణానికి ₹1,911 కోట్లు, ఫేజ్–2 కు ₹2,710 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం ₹4,621 కోట్లు ఉండనుంది. ప్రాజెక్టు 8.94 కిలోమీటర్ల మేర రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో కూడా మార్గం కట్టబోతున్నది.
ఈ గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ పూర్తి అయిన తర్వాత పరిశ్రమలు, ఐటీ హబ్‌లు, ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ పెరుగుతుంది. పర్యావరణ హిత రవాణా కోసం సైకిల్ ట్రాక్‌లు, గ్రీన్ బెల్ట్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. అదనంగా, ఈ రహదారి ఈ-సిటీకి కీలక కనెక్టివిటీని అందిస్తుంది, ముఖ్యంగా సెమీ కండక్టర్ , హార్డ్‌వేర్ ఉత్పత్తి రంగాలకు పెద్ద ఊతమివ్వనుందని అధికారులు పేర్కొన్నారు.
IND vs PAK Final: పన్నెండింటిలో నాలుగే.. టీమిండియాను కలవరపెడుతున్న రికార్డులు!