కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో శ్రమ్ శక్తి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల స్థితి గురించి చర్చించారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అంశంపై చర్చ జరిగింది. మెట్రో ఫేజ్-2 కోసం తెలంగాణ ప్రభుత్వం పంపించిన డీపీఆర్ ఇటీవలే అందిందని ఖట్టర్ తెలిపారు.
READ MORE: Iran: ‘‘లొంగిపోము, జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు’’.. ట్రంప్‌కి సుప్రీంలీడర్ ఖమేనీ వార్నింగ్..
ఈ డీపీఆర్‌ను మంత్రిత్వశాఖ అధికారులు పరిశీలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ డీపీఆర్ రూపొందించి ఉంటారని ఖట్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు.