HCU Case: HCU భూ వివాదంపై హైకోర్టు విచారణ వాయిదా
- HCU భూ వివాదంపై హైకోర్టు విచారణ
- ఈ నెల 24కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HCU Case: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల విషయంలో ఇటీవల కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ఫేక్ వీడియోలు, తప్పుడు ఫోటోలను ప్రసారం చేస్తూ కావాలనే వివాదం సృష్టిస్తున్న దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫేక్ ప్రచారంలో యూనివర్సిటీ భూములను అక్రమంగా ఆక్రమించారని, పర్యావరణాన్ని ధ్వంసం చేశారనీ, వన్యప్రాణులకు నష్టం వాటిల్లిందంటూ ఊహాగానాలు వ్యాప్తి చెయ్యడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందిస్తూ, ఈ తప్పుడు ప్రచారంపై చట్టపరంగా కోర్టుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. దీనితో ఆ కేసు నేడు విచారణ చేపట్టారు.
Read Also: MI vs RCB: బుమ్రా వేసిన తొలి బంతికే ఫోర్ లేదా సిక్స్ కొడతా: టిమ్ డేవిడ్
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఇక HCU భూ వివాదం సంబంధించిన కేసుపై ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ వ్యాఖ్యానిస్తూ, ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదని పేర్కొంది. అలాగే కోర్టుకు కౌంటర్, రిపోర్ట్‌ను ఈ నెల 24 లోగా సమర్పించాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామాలతో హైదరాబాద్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం మరింత కీలకంగా మారింది. సోషల్ మీడియా వేదికగా అసత్యపు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విచారణ సందర్భంగా న్యాయపరమైన నివేదికలు, వాస్తవ ఆధారాలతో కూడిన వివరాలు కోర్టుకు సమర్పించనున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?