High Court Chief Justice : తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా (High Court Chief Justice) జస్టిస్ సుజయ్ పాల్ (Justice Sujoy Paul) నియమితులయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్‌కు సీజేగా బాధ్యతలు అప్పగించబడింది. ఇంతవరకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధే (Justice Aloke Aradhe) బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ అయ్యారు.
Arvind Kejriwal: బీజేపీ ఓటర్లకు బంగారు గొలుసుల్ని ఇస్తోంది..
జస్టిస్ సుజయ్ పాల్ 1964 జూన్ 21న జన్మించారు. ఆయన బీకాం, ఎంఏ, ఎల్ఎల్‌బీ విద్యను పూర్తి చేశారు. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేసుకుని, పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, ఇతర బోర్డులకు తన సేవలను అందించారు.
2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సుజయ్ పాల్, 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసుతో 2024 మార్చి 21న ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఇప్పుడు ఆయన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులవడం ద్వారా తన న్యాయ సేవా ప్రయాణంలో మరో కీలక ఘట్టానికి చేరుకున్నారు.
Prabhala Theertham: కొత్తపేటలో అంగరంగ వైభవంగా ప్రభల ఉత్సవం ప్రారంభం..