దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో 18 మంది మృతి, 130 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషాద ఘటన నగర ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. 2016లో NIA ఫాస్ట్‌ట్రాక్‌కోర్టు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. అయితే కింది కోర్టు తీర్పుపై ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన నిందితుడు రియాజ్‌భత్కల్ ఇప్పటికి పరారీలో ఉన్నాడు. ఈ జంట పేలుళ్లకు ప్రధాన కారకుడైన యాసిన్ భత్కల్ అని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.