గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. అభ్యర్థి స్థానికత వివాదంపై TSPSC అప్పీల్‌ను హైకోర్టు విచారించింది మరియు వివాదంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రైతులు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరగనుంది. ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ ను రోహిత్ రెడ్డి దాఖలు చేసిన విషయం తెలిసిందే.. పిటిషన్ లో నలుగురుని ప్రతివాదులుగా చేర్చారు.
ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముఖ్యమంత్రి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన ఎవిడెన్స్‌ను చూసి తదుపరి విచారణ చేపడుతామని కోర్టు పేర్కొంది.
High Court permits YS Sharmila's padayatra: వరంగల్ జిల్లాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. సోమవారం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో చేపట్టిన పాదయాత్ర రణరంగంగా మారింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఇదిలా ఉంటే తనపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ షర్మిల ఈ రోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. నిన్న దాడి…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై సందిగ్ధత నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు పాదయాత్ర మొదలవుతుందా..? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. లా అండ్ ఆర్డర్ కారణాల వల్ల చివరి నిమిషంలో పోలీసులు మార్చ్‌కు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఈరోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది.