Telangana High Court Gives Big Shock To Sunil Kanugolu: తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు హైకోర్టులో చుక్కెదురైంది. సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందేనని, పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందేనని, విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల8వ తేదీన విచారణకు హాజరవ్వాలని తీర్పునిచ్చింది. అయితే.. ఆయన్ను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ధర్మాసనం సూచించింది. కాగా.. తెలంగాణ సీఎం, ఆయన కుమారుడు, కూమార్తెను కించపరిచేలా పోస్టింగ్‌లు పెట్టారని సునీల్ కనుగోలుపై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఆర్పీసీ 41(ఏ) కింద సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు ఇటీవల ఆయనకు నోటీసులు జారీ చేశారు.
GVL Narasimha Rao: ఆ తర్వాతే కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టాలి..!
తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన ఆర్. సామ్రాట్ అనే ప్రైవేట్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో.. నవంబర్ 24న సునీల్‌పై సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు లభించిన ఒక క్లూ ఆధారంగా.. డిసెంబర్ 13వ తేదీన మాదాపూర్‌లోని మైండ్‌షేర్ యునైటెడ్ ఫౌండేషన్‌లో ఉన్న కార్యాలయంపై దాడి చేశారు. అక్కడ పట్టుబడిన ముగ్గురిలో సునీల్ పేరు వెలుగులోకి వచ్చింది. విచారణకు హాజరు కాకపోతే.. అరెస్ట్ సహా ఇతర చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. దీనిపై హైకోర్టుకి వెళ్లిన సునీల్.. సీఆర్‌పీసీ 41 (ఏ) సెక్షన్ కింద ఇచ్చిన నోటీసుపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కచ్ఛితంగా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది.
Balayya vs Chiranjeevi: డల్లాస్‌లో చిరు, బాలయ్య ఫ్యాన్స్ మధ్య గొడవ