బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను బీజేపీ లీగల్ సెల్ దాఖలు చేసింది. బండి సంజయ్ పై బొమ్మల రామారం పోలీసుల లీగల్ ప్రొసీడింగ్స్ కు రంగం సిద్దం చేసింది.
YS Viveka Murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.. ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.. సోమవారం వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దు.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేకా కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ…
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. దీంతో..నేడు సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
ఇవాల కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసం విచారణ చేపట్టింది.
ఎమ్మెల్యే ఎర కేసులో సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఈ నెల 17న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఈరోజు సీజేఐ ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను ప్రస్తావించారు.ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో మెరిట్‌లు ఉంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలను తిప్పికొడతామని…
MLAs poaching case: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. గతంలో సీబీఐతో విచారణకు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆర్డర్‌పై తెలంగాణ సర్కార్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ కేసును సీబీఐకు ఇవ్వాలా..? వద్దా..? అనే అంశంపై నేటితో…
Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళ్ హాట్ పోలీసులు మంగళవారం మరోసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు.
K.A.Paul : కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ముసాయిదాను మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.
Budget 2023: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య దూరం పెరుగుతోంది. ఇప్పటి వరకు బడ్జెట్‌కు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపలేదు. దీంతో గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది.