Telangana High Court: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రైతులు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికప్పుడు ఏమీకాదని హైకోర్టు పేర్కొంది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ ఏళ్ల తరబడి ఊగిసలాడుతూనే ఉంటుంది. అనుకున్నట్లు జరిగితే దేశం బాగుండేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలు తీసుకుంటామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.
Read also: Cesarean infection: మళ్లీ బాలింతలకు అస్వస్థత.. సిజేరియన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ తో అవస్థలు
అలాగే కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి రూపొందించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్‌పై కామారెడ్డి జిల్లాకు చెందిన కొందరు రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కామారెడ్డి మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన 40 మంది రైతులు కోర్టులో పిటిషన్ వేశారు. తమను సంప్రదించకుండానే రిక్రియేషన్ జోన్‌గా ప్రకటించారని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. తమకు నష్టం వచ్చే విధంగా మాస్టర్ ప్లాన్ ఉందన్నారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వ స్పందనను కోరుతూ విచారణను నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో మాట్లాడిన మున్సిపల్ కమిషనర్ బోనగిరి నరేష్ మట్లాడారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు వినతి పత్రాలను అందజేశారు. 6 గ్రామాల్లో 20016 సర్వే నెంబర్లలో మాస్టర్ ప్లాన్ జోన్లను రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాలు అందజేసిన రైతులు. ఎవరికి చెప్పి మాస్టర్ ప్లాన్ రూపొందించారని కమిషనర్ తో రైతులు వాగ్వాదానికి దిగారు దీంతో అక్కడ ఉదృక్త పరిస్థితి నెలకొంది.
Read also: Rahul Gandhi: బీజేపీ ద్వేషాన్ని పెంచుతోంది..
ఇది ఇలా ఉండగా NTV తో జగిత్యాల మున్సిపల్ కమిషనర్ బోనగిరి నరేష్ మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ఇప్పటి వరకూ రైతుల 39 వినతి పత్రాలు అందాయని తెలిపారు. 6 గ్రామాల్లో మాస్టర్ ఫ్లాన్ ప్రతిపాదన మాత్రమే అయిందని స్పష్టం చేశారు. మాస్టర్ ఫ్లాన్ కు ఇంకా రెండు నెలల సమయం ఉందని అన్నారు. ప్రజా ఆమోదం ప్రకారమే డ్రాఫ్ట్ ప్లాన్ ఉంటుందని తెలిపారు. మాస్టర్ ఫ్లాన్ ఫైనల్ కాకుండానే రైతులు నిరసనలు తెలుపుతున్నారని నరేస్ పేర్కొన్నారు.
Tollywood: వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్