ఏపీ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ BS3 వాహనాలను BS4గా మార్చి నడుపుతున్నారని అభియోగాలకు గానూ ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
TS Hig Court: ములుగు జిల్లాలోని ఆదివాసీల సుదీర్ఘ పోరాటం ఫలించింది. తెలంగాణ హైకోర్టు వారికి అనుకూలంగా సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలేనని తెలిపింది.
Avinash Reddy: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది.
Tspsc paper leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ వేగవంతం చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. తదుపరి దర్యాప్తు పురోగతిపై జూన్ 5లోగా నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జిల్లా జడ్జీలను హైకోర్టు బదిలీ చేసింది. వార్షిక బదిలీల్లో భాగంగా పెద్ద సంఖ్యలో జిల్లా సెషన్స్ జడ్జీలను ట్రాన్స్ పర్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 41 మంది డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జీలను బదిలీ చేసింది.
10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్ రద్దుపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. దీంతో బీజేపీ వర్గాల్లో ఉత్కంఠ వాతావరణం సాగనుంది.