తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థల సెలవులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైరస్ విజృంభణ నేపథ్యంలో సంక్రాంతి సెలవులను మూడు రోజుల ముందుగానే 8వ తేదీ నుంచే ప్రకటించారు. ఇవి ఈ నెల 16తో ముగియాల్సి ఉంది. అయితే, కొవిడ్ కేసులు రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సెలవులను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రభుత్వం వద్ద వ్యక్తం చేశారు. Read Also:…
ఇతర రాష్ట్రాల పల్లెల కన్నా తెలంగాణ పల్లెలు నేడు బాగున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వననపర్తి జిల్లాలోని గోపాల్పేట మండలం కేశంపేట, చెన్నారం గ్రామాల పరిధిలో ఉన్న ఎంజే 1 కాలువను పరిశీలించి కృష్ణా జలాలకు పూలు చల్లి పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. అన్నదాతలు సుభిక్షంగా ఉంటేనే సమాజం బాగుంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. రైతులు సంతోషంగా ఉండేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతుబంధు ద్వారా…
సంక్రాంతి అనగానే గాలి పటాలను ఎగుర వేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక పిల్లలకు అయితే ఈ పండుగ ఎంత ప్రత్యేకమో చెప్పనవసరం లేదు. సంక్రాంతి సెలవుల్లో పిల్లలందరూ గాలిపటాలను ఎగురవేయడమే కాకుండా, గాలిపటాల ఎగురవేతపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలు ఇతరుల గాలిపటాలను ఓడించేందుకు నిషేధిత దారాలను ఉపయోగిస్తుంటారు. అయితే గాలి పటాలను ఎగురవేసేటప్పడు దానికి వాడే దారం, మాంజా వంటివి ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్…
సంక్రాంతి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆయన నివాసంలో సంబరాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గంగిరెద్దు విన్యాసాలను తిలకించారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు బంధు ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకూ 50వేల కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. రైతులు సంక్రాంతిని రైతుబంధు సంబురాలుగా నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. Read Also: రాష్ట్రంలో శవ రాజకీయాలు చేసేది చంద్రబాబు: మంత్రి…
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో బియ్యం పంపిణీ చేసే గడువును కేసీఆర్ సర్కార్ ఐదు రోజులకు పెంచింది. ప్రతి నెల ఒకటో తేదీన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ పంపిణీ ప్రారంభం అవుతుంది. అలాగే రేషన్ పంపిణీ ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగుతుంది. మాములుగా అయితే అదే నెల ఒకటో తేదీన ప్రారంభమైన రేషన్ పంపిణీ ప్రక్రియ అదే నెల 15వ తేదీన ముగుస్తుంది. Read…
తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానది నుంచి అదనంగా నీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మెన్ కు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ప్రభుత్వం తరపున తరపున మూడు లేఖలను రాశారు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 45 టీఎంసీల నీరు వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కృష్ణా నది యాజమాన్య బోర్డును లేఖ ద్వారా కోరారు. అలాగే పోలవరం ద్వారా 80 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని తెలిపారు. Read…
దేశంలో పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ రాసిన లేఖకు ప్రధాని వెంటనే జవాబు చెప్పాలన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే రైతులు ఆనందంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఉపేక్షించేది…
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతికి 4,318 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. అయితే సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలోప్రత్యేక బస్సులు ఈ నెల 7 నుంచి 14 వరకు నడపనున్నట్టు వెల్లడించారు. 4,318 ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు నడుస్తాయని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్కు కూడా భారీ సంఖ్యలో టీఎస్…
ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అందించింది. ఆశావర్కర్ల నెలవారీ ప్రోత్సాహకాలను 30శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కింద పనిచేస్తున్న, నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నెలవారీ ప్రోత్సాహకాలతో ఆశావర్కర్ల నెలవారీ జీతం పెరగనుంది. తెలంగాణ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం మేరకు ఆశావర్కర్లు ఇకపై నెలకు రూ.7,500 జీతం బదులుగా రూ.9,750 అందుకోనున్నారు.…
రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయం వేడెక్కింది. బండి సంజయ్ అరెస్ట్, నడ్డా క్యాండిల్ ర్యాలీ, టీఆర్ఎస్ నేతల కౌంటర్లు, మంత్రి కేటీఆర్ విమర్శలతో తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తాజాగా తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 10న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది బీజేపీ. అక్రమ అరెస్ట్లకు నిరసనగా నిరసనగా బీజేపీ బంద్కు పిలుపునిచ్చింది. ప్రధానంగా 317 జీవోను సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు బీజేపీ నేతలపై ముఖ్యంగా…