రాష్ట్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వినూత్న రీతిలో నిరసనకు సిద్ధమయ్యారు. నిద్రపోతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మేల్కొలిపి ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా ఉన్న 317 జీఓను ఉపసంహరించుకునేలా రేపు రాత్రంతా కరీంనగర్లో జాగరణకు పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని తన కార్యాలయంలో రేపు (జనవరి 2) రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు (జనవరి 3) ఉదయం 5 గంటల…
కరీంనగర్లో రేపు రాత్రి 9 గంటల నుంచి 3 జనవరి ఉదయం 5 గంటల వరకు జాగరణ చేయాలని బీజేపీ నిర్ణయించిందని బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హజరవుతారని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు, పోలీసులకు, టీచర్లకు బదిలీలకు సంబంధించిన 317 జిఓ ఉద్యోగ సంఘాలతో చర్చించి సవరించాలని డిమాండ్ చేస్తు జాగరణ చేస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. Read…
సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం 1లక్ష829 రూపాయలు మాత్రమే నమోదయిందని కానీ 2020-21 సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం 2 లక్షల 37వేల 632 రూపాయాలకు పెరిగిందని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో 2014-15 సంవత్సరంలో 1లక్ష 24వేల 104 రూపాయాల తలసరి ఆదాయం, 2020-21 నాటికి 2 లక్షల 37వేల 632 రూపాయాలకు పెరిగిందని మంత్రి అన్నారు. Read Also: నాలుగో రోజు 6లక్షలకు పైగా ఖాతాల్లో…
తెలంగాణలో నాలుగో రోజు 6 లక్షల 75 వేల 824 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 1144.64 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. దీంతో కలిపి ఇప్పటి వరకు 52 లక్షల 71 వేల 91 మంది రైతులకు రైతుబంధు నిధులు అందింది. మొత్తం పెట్టుబడి సాయం రూ. 4246.68 కోట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. సంప్రదాయ సాగు నుంచి రైతులు బయటకు రావాలని సూచించారు.…
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణలో ఎలాంటి మతపరమైన హింసాకాండగానీ, మరే ఇతర ప్రధాన శాంతిభద్రతలుగానీ చోటుచేసుకోలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం మహేందర్ రెడ్డి (డీజీపీ) అన్నారు. శుక్రవారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నేరాల రేటును ఆయన వివరించారు. నిర్మల్ జిల్లా భైంసాలో గత ఏడేళ్లలో జరిగిన చిన్న చిన్న ఘటనలు తప్ప పెద్దగా ఎలాంటి మత ఘర్షణలు రాష్ర్టంలో చోటు చేసుకోలేదని ఆయన…
టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులు చనిపోతున్నా సీఎం కేసీఆర్‌లో చలనం రావడం లేదని ఆరోపించారు. జీఓ 317 యమపాశంతో ఓ ఉపాధ్యాయుడిని బలి తీసుకున్నారని, 317 జీఓ వల్ల ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారన్నారు. రైతుల చావులు మారుమోగుతున్న తెలంగాణలో మరో మరణ మృదంగానికి తెరలేపాడు దొర. Read Also:సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలి: కేటీఆర్ సీనియారిటీ చిచ్చు పెట్టి…
నల్లగొండ జిల్లాలో టీహబ్, టాస్క్ సెంటర్‌ను మంజూరు చేస్తామని రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలోని నూతన ఎస్సీ, ఎస్టీ హస్టల్ భవనాలను ప్రారంభించి. టీహబ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నల్లగొండకు ఐటీ హబ్ కేసీఆర్ వల్లనే సాకరమైందన్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీని రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్న ఘనత టీఆర్ఎస్దేనన్నారు. ఐటీ సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలనేదే సీఎం కేసీఆర్లక్ష్యమన్నారు. వరంగల్,…
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పురపాలికలు మేయర్లు,చైర్పర్సన్, కమిషనర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాలు, పల్లెల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో…
గడచిన మూడు నాలుగు నెలలుగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మరణ మృదంగం మోగుతుందని అధికారికంగానే నిత్యం ఐదు నుంచి పది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఒక వైపు వరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండగా, మరో వైపు మిర్చీ రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని, నెలల తరబడి ధాన్యం కుప్పలపై పడిగాపులు కాస్తోన్న రైతు హఠాత్తుగా శవమై కనిపిస్తోన్న…
ఉపాధ్యాయ సంఘాలకు వైఎస్ షర్మిళ మద్దతు తెలిపారు. జీఓ317 రద్దు చేయాలని, జీఓ 317అంతా తప్పుల తడకగా ఉందని షర్మిళ అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలని తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ఈ జీఓ స్థానికులనే స్థానికేతరులను చేసిందన్నారు. Read Also:విద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం మాదే: హరీష్‌రావు పుట్టిన ఊరు, చదువుకున్న ఊరు స్థానికత కాదని ఎలా చెప్తారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ లబ్దికోసం జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య పంచాయతీ పెడుతున్నారని చెప్పారు.…