గోదావరి యాజమాన్య బోర్డు సబ్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. బోర్డు మెంబర్, సెక్రటరీ పాండే అధ్యక్షతన సబ్ కమిటీ భేటీ అయింది. సమావేశ అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. పెద్దవాగు తప్ప ఇంకే ప్రాజెక్టు ఇవ్వం.. జీఆర్ఎంబీ సబ్ కమిటీ మీటింగ్‌లో తెలంగాణ తేల్చేసింది. తెలంగాణలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ.. ఏపీలోని వెంకటనగరం లిఫ్ట్ పై సమావేశంలోఈ సమావేశంలో చర్చించారు. వెంకటనగరం లిప్ట్ బోర్డు నిర్వహణ ఇచ్చేందుకు ఏపీ అంగీకారం తెలిపింది. గెజిట్ లోని రెండో షెడ్యూల్ గల కాళేశ్వరం బ్యారేజీలతో పాటు మిగతా ప్రాజెక్టులు మూడో షెడ్యూల్ లోకి మార్చాలని సమావేశంలో తెలంగాణ నీటీ పారుదల అధికారులు కోరారు. తాము ఇచ్చిన డీపీఆర్‌లపై నిర్ణయం తీసుకుని ప్రాజెక్టు అనుమతులు తేల్చే వరకు గోదావరి ప్రాజెక్టులపై చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ అధికారులు తెలిపారు.