తెలంగాణలో మరోసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదనంగా రూ.4,500 కోట్ల రాబడికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆస్తులు, భూముల విలువపై సహేతుక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50 శాతం పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. Read Also: శరవేగంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు.. 4 రోజుల్లో 45 అటు స్థలాల విలువను 35 శాతం,…
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఊకచెట్టు వాగుపై కురుమూర్తి స్వామి దేవాలయం వరకు కాజ్ వే బ్రిడ్జి, చెక్ డ్యామ్, బీటీరోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డితో కలిసి భూమిపూజలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. 70 ఏళ్ళుగా ఇక్కడ ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా.. ముఖ్యమంత్రిగా కూడా పదవులు అనుభవించిన వారున్నారు.. వాళ్ళు ఈ ప్రాంతానికి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు.…
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. వరంగల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల కూర్పు, ఉపాధ్యాయుల కేటాయింపు గందరగోళంగా మారిందని ఆయన విమర్శించారు. ఉపాధ్యాయుల కేటాయింపులో శాస్త్రీయత లేదన్నారు. సీనియారిటీ లిస్టును ఎక్కడా ప్రదర్శించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తప్పుడు జీవో తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. Read Also:రైతులకు భరోసా కల్పించేందుకు దొర బయటికి రారు: షర్మిల ఉద్యోగులతో చర్చించకుండా ఏకపక్షంగా జీవోలు తీసుకువచ్చి ఉద్యోగులను తన్నుకు…
కేసీఆర్ ప్రభుత్వం పై షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. రైతుల మరణాలను ఊటంకిస్తూ ట్విట్టర్ వేదికగా ఆమె తీవ్ర స్థాయిలో కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఓ వైపు రైతులు మరణిస్తున్నా కేసీఆర్కు సోయి లేదంటూ మండిపడ్డారు షర్మిల. దొరా మీరిచ్చే హామీలకే దిక్కులేనప్పుడు, మీరు సాయం చేస్తారనే ఆశ లేక,పత్తికి మిరపకు తెగులు సోకి, పెట్టిన పెట్టుబడి రాక, పంటను కాపాడలేని పురుగుల మందే మమ్మల్ని అప్పుల నుంచి కాపాడుతుందని,రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు చనిపోతున్నాదున్నపోతు మీద వాన…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర హై కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 317 పై తాము స్టే ఇవ్వలేమని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటికే ఒకసారి తెలంగాణ హై కోర్టు జీవో నెంబర్ 317 పై ఇలాగే స్పందించింది. తాజాగా ఈ రోజు కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయిపుల పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఈ విధంగా…
తెలంగాణ వ్యాప్తంగా రోగులకు ప్రిస్కిప్షన్పై మందులు రాసే విషయంలో వైద్యులకు రాష్ట్ర వైద్య మండలి కీలక ఆదేశాలను జారీ చేసింది. జనరిక్ మెడిసిన్ పేర్లనే ప్రిస్కిప్షన్లలో రాయాలని సూచించింది. ఔషధాల బ్రాండ్ నేమ్ మాత్రం రాయవద్దని ఆదేశాలు జారీ చేసింది. మెడిసిన్ బ్రాండెడ్ పేర్లకు బదులుగా వాటిలోని కాంపౌండ్ మెడిసిన్లనే పేర్కొనాలంటూ గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను వైద్య మండలి గుర్తుచేసింది. మందుల చీటీల్లో బ్రాండ్ నేమ్ పేర్కొనరాదని ఇటీవల భారతీయ వైద్య మండలి, లోకాయుక్త కూడా…
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో RT-PCR పరీక్షలు పెంచాలని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష టెస్టులు చేయాలని సూచించింది. RT-PCR, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు…
తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సోమవారం నాడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. ఈనెల 12 వరకు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఈనెల 12 వరకు మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 6.95 పాజిటివిటీ రేటు నమోదైంది. అలాగే జీహెచ్ఎంసీలో 5.65 శాతం పాజిటివిటీ రేటు ఉన్నట్లు అధికారులు…
ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలోని పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు భారీ గండి పడింది. దీంతో నీరు వృధాగా పోతుంది. ప్రాజెక్టుకు గండి పడి నీరుగా వృధాగా పోతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మత్తులు చేయాలని గతంలో పలుమార్లు అధికారులకు రైతులు విన్నవించినప్పటికీ పట్టించుకోని పరిస్థితి. నాసిరకంగా కెనాల్ నిర్మాణం చేపట్టండం వల్లే గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. Read Also: మళ్లీ తెరపైకి మహిళా యూనివర్సీటీ.. ఓవైపు ప్రకృతి విపత్తులు మరో వైపు…
శతాబ్దపు ఘన చరిత్ర కలిగిన కోఠి ఉమెన్స్ కాలేజ్ కు మహిళా విశ్వ విద్యాలయం హోదా త్వరలోనే దక్కనుంది. దీని కోసం గతంలోనూ కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు చేయగా… కార్యరూపం దాల్చలేదు. కానీ.. ఈ విడత సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ నుంచి ఈ ప్రతిపాదన రావడంతో కోఠి ఉమెన్స్ కాలేజీ యూనివర్సిటీ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో కేటీఆర్ తాజాగా కోఠి మహిళా యూనివర్సిటీ ప్రతిపాదనను చర్చకు…