సమాజాన్ని మార్చే ఏకైక ఆయుధం విద్య. ముఖ్యంగా సమాజంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జీవితాలు మారాలన్నా అందరితో సమానంగా అవకాశాలు దక్కించుకోని వృద్ధిలోకి రావాలన్నా ఆయా వర్గాలను విద్యా వంతులను చేయడమే ఏకైక మార్గమని మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహానీయులు విశ్వసించడమే కాదు అందుకోసం ఎంతో కృషి చేశారు. ఆ మహానీయుల స్ఫూర్తిని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. బీసీ రిజర్వేషన్లను పెంచడం, ఎస్సీ వర్గీకరణ వంటి విధాన నిర్ణయాలకే…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును హైకోర్టు నిలిపివేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధమైంది.
చిన్నారులలో తీవ్రమైన రోగాల్ని, మరణాలను కలిగిస్తున్న ప్రమాదకర దగ్గు మందులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తూ చర్య తీసుకుంది. రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ అనే రెండు సిరప్లను విక్రయించరాదు అని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పాత్రపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రభాకర్ రావుకు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహించిన భూముల వేలం రికార్డుల సృష్టికర్తగా నిలిచింది. రాయదుర్గం ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీ భూభాగాలపై నిర్వహించిన ఈ వేలం ఊహించని స్పందనకు దారితీసింది. ఒక ఎకరం భూమి ధర ₹177 కోట్ల వరకు చేరడం మార్కెట్ లో శ్రేష్ఠ రికార్డ్ స్థాపించిందని తెలుస్తోంది.
తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా మళ్లీ ఇక్కడకు ఎందుకు వచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. మరోవైపు ఏసీబీలో ముగ్గురు అధికారుల అవినీతిపై విచారణ కొనసాగుతోంది.