Movie Tickets Rates : తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల విషయంలో ఎప్పటినుంచో చాలా అనుమానాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపునకు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలకు మాత్రం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇంకొన్ని సినిమాలకు బెనిఫిట్ షోలు కూడా వేసుకునేలా జీవో ఇచ్చారు. మొన్న…
Telangana Govt: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీలకు రూ.2780 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Kurnool Bus Fire : హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూల్ ఘటనలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి రూ.2 లక్షల సహాయం అందజేయనున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. Ananya…
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు ఘనంగా ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం శూన్యం అని ఆయన అన్నారు. “గాలి మాటలతో ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు?” అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అని హరీష్ రావు పేర్కొన్నారు. చిన్న ఉద్యోగుల…
Checkposts Close: తెలంగాణలోని అన్ని రవాణా శాఖ చెక్‌పోస్టులను తక్షణమే మూసివేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయంత్రం 5 గంటలలోపు చెక్‌పోస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రవాణా శాఖ పరిధిలో ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుల వద్ద, ప్రధాన మార్గాల్లో పనిచేస్తున్న చెక్‌పోస్టులన్నీ తక్షణమే మూసివేయాలని కమిషనర్ సూచించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వెంటనే పునర్వినియోగం చేయాలని, వారికి తగిన విధులు కేటాయించాలని ఆదేశించారు.…
CM Revanth Reddy : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. నూతన ఆసుపత్రి అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్‌లు,…
తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకాన్ని అందించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అతిథిగా పాల్గొని శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సులు పంపిణీ చేసిన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి అధ్యక్షత వహించి మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ.. “దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ లైసెన్సుల పంపిణీ తొలి అడుగు.…
TG Cabinet : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు జరిగిన కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి. ఇందులో రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల విభాగం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అంగీకరించింది.. మరో 15 లక్షల మెట్రిక్…