CM Revanth Reddy : ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలకు సీఎం రేవంత్ వార్నింగ్..
- సహకరించాల్సిన వాళ్ళు బంద్ పెట్టారు
- బంద్ పెట్టారు కదా.. ఫీజులు అడగరా..?
- ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారో నాకు తెలియదా..?
- చూద్దాం.. వచ్చే ఏడాది నుండి ఎట్లా డొనేషన్లు తీసుకుంటారో : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం దుమారం రేపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, మొత్తం బకాయిల్లో కనీసం 50 శాతం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు మరోసారి సమ్మెకు దిగాయి. అయితే.. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.
CM Revanth Reddy : బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కేటీఆర్.. ఇద్దరు కలిసి..
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
“సహకరించాల్సిన వారు బంద్ పెడుతున్నారు. బంద్ పెట్టారు కదా, ఫీజులు అడగరా..? మేము వచ్చిన తర్వాత బకాయి పెరిగినా వాటిని విడతల వారీగా చెల్లిస్తాం. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు” అని ఆయన హెచ్చరించారు. ఇద్దరు కాలేజీ పెద్దలు పైరవీకి వచ్చారని కానీ ప్రభుత్వం ఒత్తిడికి లోనుకావడం లేదని చెప్పారు. “విద్య సేవ.. వ్యాపారం కాదు. విద్యార్థులను వెనక్కి తిప్పడం ఎట్లనో నాకు తెలుసు. ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ఇప్పటివరకు ఆపని చేయలేదు. కానీ అవసరమైతే చూడాలి” అని రేవంత్ హెచ్చరించారు.
ప్రైవేట్ కాలేజీల రాజకీయ అనుబంధాలపై కూడా వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. “మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో నాకు తెలియదా? మాట్లాడుతున్న ముగ్గురి సంగతి కూడా నాకు తెలుసు. వచ్చే ఏడాది నుండి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం” అని అన్నారు. అధికారులపై కాలేజ్ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. “అధికారులను తిడతారట..! ఎట్లా తిడతారు? ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. విద్యార్ధుల భవిష్యత్తు పణంగా పెట్టొద్దు. విద్యార్ధులపై బరువుగా మారే విధంగా డొనేషన్లు, ఫీజులు పెంచితే సహించం” అని స్పష్టం చేశారు. అరోరా కాలేజీ రమేష్ కి ఎన్ని అనుమతి ఇవ్వాలి మహబూబ్ నగర్ లో క్యాంప్ ఉంటది..హైదరాబాద్ లో అనుమతి ఇవ్వాలి అంట అని సీఎం రేవంత్ మండిపడ్డారు.
CM Revanth Reddy : ORRను పల్లిబఠానీల లెక్క అమ్మేశారు కేసీఆర్
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!