Minister Seethakka : వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ ఆధ్వర్యంలో సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్ లో డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. మిషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా దేశంలోని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలను సహకారం చేస్తూ ముందుకు వెళుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. డి అడిక్షన్ సెంటర్ నిర్వహణ కోసం వికలాంగులు,వయోవృద్ధులు,ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ ద్వారా 13 లక్షల 80 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని భవిష్యత్తులో ఈ సెంటర్ కు ఎలాంటి ఇబ్బందులు కలకుండా నడపడానికి నిధులు మంజూరు చేసినట్టు సీతక్క తెలిపారు. డి-అడిక్షన్ సెంటర్ కోసం ప్రత్యేక మానసిక నిపుణుల ద్వారా మాదకద్రవ్యాలకు బానిసైన పిల్లకు కౌన్సిలింగ్,వైద్య చికిత్స,ఇతర అనేక సేవలు అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. త్వరలోనే డి-అడిక్షన్ సెంటర్ ను అన్ని అబ్జర్వేషన్ హోం లో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని అన్నారు. యువత మారకద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా తమ లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమై మారకద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు.
Nidhi Agarwal : హీరోతో ‘ఆ పని చేయొద్దు’ అంటూ అగ్రిమెంట్