Eatala Rajendar: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా కేబినెట్ లో ఆమోదం లేకుండా ఏమి జరగదు.. ఆయన మంత్రి వర్గంలో ఉన్నవారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వారిని అడగవచ్చు అని సూచించారు.
రైతు భారోసా నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. నాలుగు ఎకరాల వరకు రైతుభరోసా నిధులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రైతుభరోసా కోసం మరో రూ.1313.53 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. మరో వారంలోగా పూర్తిగా రైతుభరోసా నిధుల జమ చేస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని విమర్శించారు.
Konda Surekha : వరంగల్ తూర్పులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ మంత్రి కొండా సురేఖ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఆవాసం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆమె తెలిపారు. 15 సంవత్సరాల విరామం తర్వాత పేదలకు ఇళ్ల నిర్మాణం జరగడం ఎంతో గర్వకారణమని, ఇందుకు అనుకూలంగా ప్రభుత్వం రూ.22,500 కోట్లు వెచ్చించి నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్ల…
New Ministers Chambers : తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులకు సచివాలయంలో తమ తనఖా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) చాంబర్ల కేటాయింపుపై ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మంత్రివర్గంలోకి తీసుకున్న అడ్లూరి లక్ష్మణ్‌కు సచివాలయ మొదటి అంతస్తులో 13, 14, 15, 16 నంబర్ గదులు కేటాయించగా, మంత్రి వివేక్ వెంకటస్వామికి రెండో అంతస్తులో 20, 21, 22 నంబర్ గదులు లభించాయి. వాకిటి శ్రీహరికి రెండో అంతస్తులోనే…
Boora Narsaiah Goud : కాంగ్రెస్ నాయకత్వంపై బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీని చూస్తుంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గుర్తొస్తున్నారు అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓ జెలెన్స్కీ లాంటివారిగా మారారని ఎద్దేవా చేశారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. రోజుకో తీపి కబురుతో…
CM Revanth Reddy : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని… ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని సీఎం వెల్లడించారు.…
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మీయ పండుగలలో ఒకటైన బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది తొలి బోనం జూన్ 26న చారిత్రాత్మక గోల్కొండ కోటలో ప్రారంభం కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తర్వాత వరుసగా బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ బోనాలు జరగనున్నాయి. బోనాల పండుగను రాష్ట్ర గౌరవానికి మారు పేరుగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 20 కోట్లు…
Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం పదేళ్ల తర్వాత గద్దర్ అవార్డుల పేరుతో సినిమా అవార్డులను ప్రకటించింది. ఇప్పటికే విజేతలను ప్రకటించిన ప్రభుత్వం.. ఈ నెల 14న హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా గద్దర్ అవార్డుల మెమెంటోను తాజాగా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, సినిమాటోగ్రఫీ శాఖ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. చేతికి రీల్ చుట్టుకున్నట్టు ఉండి.. పైన చేతిలో డప్పు పట్టుకున్నట్టు ఉంటుంది.…
Harish Rao : తెలంగాణలో ప్రముఖ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పునః ప్రారంభమైంది. ఈ విచారణలో భాగంగా సోమవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. ఆయన గతంలో కేసీఆర్ కేబినెట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఇంతకుముందు హరీష్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు ఫిల్లర్లు…
ప్రతీ సంవత్సరం మృగశిర కార్తె ప్రారంభం రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరికొద్ది సేపట్లో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం ఆస్తమా బాధితులు వచ్చారు. జిహెచ్ఎంసి.. పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ పలు శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి…