నటి, నిర్మాత నిహారిక కొణిదెలకు సినిమా పట్ల ఉన్న అభిరుచి అందరికీ సుపరిచితం. ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఆగస్టు 9, 2024న విడుదలై ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్లలోనూ, ఓటీటీలోనూ ఈ చిత్రం అద్భుతమైన ఆదరణ పొందింది. తాజాగా, ఈ సినిమా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుంది. Also Read:Yamudu: ఆసక్తి రేపుతున్న…
జూన్2 న భూమి లేని నిరుపేద రైతులు ఎవరైతే అసైన్డ్ భూములను సేద్యం చేస్తున్నారో వారికి పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అధికారులతో జరిగిన సమావేశంలో పొంగులేటి కీలక సూచనలు చేశారు. ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మళ్ళీ రిపీట్ కావద్దని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగొద్దని తెలిపారు.
Bhatti Vikramarka : ఖమ్మం జిల్లాలో అధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశాన్ని చాలా ప్రత్యేకమైనదిగా పేర్కొన్న భట్టి, జిల్లాల ఇంచార్జి మంత్రులు అన్ని ప్రాంతాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. భట్టి ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్లో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కొనుగోలు చేసింది. ఖమ్మం, భద్రాద్రి…
Gaddar Awards:తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను నటీనటులకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ అవార్డుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రముఖ సినీ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరీ కమిటీ ఏర్పాటు చేయగా.. తాజాగా 2024 సంవత్సరానికి సంబంధించిన సినిమా అవార్డ్స్ ను ప్రకటించారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ఇవాళ అవార్డులను ప్రకటించారు. “అవార్డుల ఎంపికలో ప్రభుత్వ జోక్యం…
సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశం పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని దిల్ రాజు అన్నారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న పవన్ అభిప్రాయం అభినందనీయం. దీనిని మనమందరం స్వాగతించి, కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని అన్నారు. Also Read: Manchu Brothers: కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్…
Bhatti Vikramarka : విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుడికి కోటి రూపాయల బీమా చెక్కు ఇవ్వడం దేశంలోనే ఇదే తొలిసారి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్‌లో ఎన్పీడీసీఎల్ పరిధిలో పనిచేసిన జోగు నరేశ్ కుటుంబానికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును, ఆయన భార్యకు విద్యుత్ శాఖలో కారుణ్య నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, “ఇలాంటి గొప్ప నిర్ణయం కేవలం సీఎం…
Ponnam Prabhakar : హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ఆధారంగా నిర్మితమైన చలనచిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నేతలతో కలిసి వీక్షించారు. ఈ సందర్బంగా సామాజిక సమానత్వం, మహిళా సాధికారత, విద్యా ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చ జరగింది. సినిమా చూసిన వారిలో ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ప్రముఖ సామాజికవేత్త కంచె ఐలయ్య, ఎంపీ సురేష్ షెట్కర్,…
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వరుల స్ఫూర్తితో పాలన సాగిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బసవేశ్వరుడి చూపిన మార్గం తెలంగాణ ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. వారి సిద్ధాంతాలను అనుసరిస్తూ సామాజిక న్యాయమని, సమానత్వంపై దృష్టి సారిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.…
Bhatti Vikramarka : జూన్ 2వ తేదీన ఐదు లక్షల యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్న లక్ష్యాన్ని సమయానికి సాధించేందుకు బ్యాంకర్ల సహకారం అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) సమావేశంలో ఆయన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవడం ముఖ్యమని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం, రాష్ట్రం అభివృద్ధి…
Breaking News : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమైంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు , ఈటల రాజేందర్‌లకు జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈ కమిషన్, 15 రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని ముగ్గురు నేతలను ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు…