Indiramma Canteen : ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం.. మెనూ అదిరిందిగా
- రోజుకు రూ.5కే ఆరోగ్యకరమైన అల్పాహారం అందించనున్న GHMC
- మిల్లెట్ ఆధారిత టిఫిన్ మెనూ సిద్ధం చేసిన హరే కృష్ణ ఫౌండేషన్
- 139 ప్రాంతాల్లో కొత్త కంటైనర్లు.. రూ. 11.43 కోట్లతో ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indiramma Canteen : తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారాన్ని అందించే పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇవ్వబోయే బ్రేక్‌ఫాస్ట్ మెనూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ నిర్ణయం మేరకు ప్రజల నుంచి ఒక్కో టిఫిన్‌కు కేవలం రూ.5 మాత్రమే వసూలు చేయనుంది. మిగతా రూ.14 ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఒక టిఫిన్‌కు మొత్తం ఖర్చు రూ.19గా అంచనా వేయగా, ప్రజలపై ఆర్ధిక భారం పడకుండా దీన్ని అమలు చేయాలని భావిస్తోంది.
Perni Nani: మీరు పట్టించుకోరు.. వైఎస్ జగన్ వెళ్తే ఏడుస్తారు!
Also Read
GHMC రూపొందించిన మెనూను హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు. ఆరోగ్యకరంగా ఉండేలా మిల్లెట్ ఫుడ్‌ను ప్రాధాన్యతనిస్తూ రోజుకో రకం అల్పాహారాన్ని అందించనున్నారు. మెనూలో 6 రోజుల అల్పాహారం ఇలా ఉండబోతుంది:
Day 1: మిల్లెట్ ఇడ్లీ (3), సాంబార్, చట్నీ/పొడి
Day 2: మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్స్ చట్నీ
Day 3: పొంగల్, సాంబార్, చట్నీ
Day 4: ఇడ్లీ (3), సాంబార్, చట్నీ
Day 5: పొంగల్, సాంబార్, చట్నీ
Day 6: పూరీ (3), ఆలూ కూర్మా

ప్రతి టిఫిన్‌కు సరిపోయేలా ఖచ్చితమైన గ్రాముల వారీగా పదార్థ పరిమాణాలూ నిర్ణయించబడ్డాయి. ఉదాహరణకి మిల్లెట్ ఇడ్లీ ఒక్కొక్కటి 45 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, చట్నీ 15 గ్రాములుగా ఉండనుంది. ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం GHMC 139 ప్రాంతాల్లో కొత్త కంటైనర్లను ఏర్పాటు చేస్తోంది. దీని కోసం మొత్తం రూ.11.43 కోట్ల వ్యయం చేయనుంది. ప్రతి క్యాంటీన్‌లో నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ, పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యం.
పేద, మధ్య తరగతి ప్రజల కోసం రూపొందించిన ఈ పథకం, ఆరోగ్యకరమైన తక్కువ ధర అల్పాహారాన్ని అందించడంలో మైలురాయిగా నిలవనుంది. వాస్తవానికి, బస్తీ వాసులు, కార్మికులు, ఉద్యోగులందరికీ ఇది నిత్యావసర సేవగా మారే అవకాశముంది. GHMC పథకం మారుమూల ప్రదేశాల్లో ఉన్నవారికీ ఆరోగ్యకరమైన భోజనాన్ని చేరవేయడమే కాకుండా, ఆహార భద్రత దిశగా కూడా ఒక ముందడుగు.
Siddaramaiah: నాయకత్వ మార్పు లేదని ఎన్ని సార్లు చెప్పాలి.. జర్నలిస్టులపై సిద్ధరామయ్య రుసరుసలు
తాజావార్తలు
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!