Pocharam Srinivas Reddy: వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని సభాపతి క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ఆదేశాలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay: పోలీసులతో బెదిరిస్తామనే నమ్మకంతో ఖమ్మం లీడర్లు ఉన్నారని.. బీఆర్ఎస్ పోటుగాళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు కాక ముందే వారి చరిత్ర తెలుసని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
Amit Shah Hyderabad Tour: కర్ణాటక ఎన్నికలు వచ్చే నెలలో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం నెక్ట్స్ టార్గెట్ తెలంగాణపై పెట్టింది.. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో 8 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచుతోంది.
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే ఉండటంతో సన్నాహక చర్యలపై ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలోని భారత ఎన్నికల సంఘానికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారుల బృందం శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తో పాటు పలువురు ఎన్నికల అధికారులతో సమావేశం అయ్యారు.