MLA Seethakka Comments on KTR Mulugu Tour: మంత్రి కేటీఆర్ ములుగు జిల్లా పర్యటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్ళు, నిధులు, నియామకాల కోసమని.. కానీ ములుగు జిల్లాకు గోదావరి జలాలు రావట్లేదని దుయ్యబట్టారు. గోదావరి జలాల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఏటూరునాగారంను రెవిన్యూ డివిజన్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వలేదని.. మెడికల్ కాలేజీ పనులు ప్రారంభం కాలేదని.. మల్లంపల్లిపి మండల కేంద్రం చేస్తామని కూడా హామీ ఇవ్వలేదని విమర్శించారు. ములుగు నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.
Errabelli Dayakar Rao: కాంగ్రెస్ వాళ్లు అభివృద్ధి చేయరు.. చేసేవాళ్లను నిందిస్తారు
రాజకీయం అంటే సేవ చేయడం అనేది తన అభిప్రాయమన్న సీతక్క.. తన ఊపిరి ఉన్నంతవరకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. డబ్బు, అధికారం ఉందని ఏదైనా చేయొచ్చని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. భుకాబ్జాలకు పాల్పడేవారు, సెటిల్‌మెంట్లు చేసే వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవ చేసే తనను ఎందుకు ఓడించాలని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ పూర్తిగా వెనుకబడ్డ రాష్ట్రమని.. అలాంటి రాష్ట్రాన్ని తెలంగాణతో ఎలా పోలుస్తారని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అనేది అందరికీ తెలుసని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని తెలిసే తమ పార్టీని టార్గెట్ చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉండదని, అందుకే తాను మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రం ఇచ్చానని చెప్పుకొచ్చారు.
Gangster Shot Dead: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్ హతం.. కోర్టులోనే కాల్పులు..
కాగా.. ములుగు జిల్లా పర్యటనకు కేటీఆర్ రావడంతో, ములుగు కలెక్టరేట్ వద్ద సీతక్క ఆయన్ను కలిసి వినతి పత్రం అందించారు. ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు వచ్చేలా రామప్ప నుంచి లక్నవరం వరకు కెనాల్ పనులు వెంటనే ప్రారంభించాలని.. గోదావరిలో లిఫ్ట్ ఏర్పాటు చేసి చెరువులు నింపాలని అందులో కోరారు. అలాగే.. మెడికల్ కాలేజీ పనులు వేగవంతం చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్ చేయాలని, మూతపడ్డ బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపించాలని, మల్లంపల్లి – లక్ష్మీదేవిపేట – రాజుపేటల్ని మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.